calender_icon.png 20 April, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండుగలా సీతారాముల కళ్యాణం

06-04-2025 10:41:41 PM

గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న కాలనీలో శ్రీరామ నవమి సందర్భంగా శేష సాయి మోక్ష మందిరం ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఉప్పల మెట్టయ్య పద్మదంపతులు, చండిక చంద్రకాంత్ లు పెళ్లి పెద్దలుగా వ్యవహరించి కళ్యాణాన్ని నిర్వహించారు. వేద పండితులు, చాడ నంద బాల శర్మ వైదిక నిర్వాహణలో కన్నుల పండుగల జరిగిన కళ్యాణోత్సవంలో విశేష సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎల్లురామిరెడ్డి, సదానందం, ఇతర సభ్యులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.