calender_icon.png 2 February, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణం

27-01-2025 12:00:00 AM

రథోత్సవంతో వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు శివపార్వతుల పల్లకి సేవలో పాల్గొన్న నరసారెడ్డి

కొండపాక, జనవరి 26: కళ్యాణం... కమనీయం శివపార్వతుల కళ్యాణం లోకానికి శుభకార్యం అంటూ శివ పంచాక్షరి మంత్రం మారు మోగుతుండగా ఆదిదేవుడు శ్రీ స్వయంభు దేవుడు పార్వతీ దేవి పరిణయమాడారు.

ఆదివారం కొండపాక మండల పరిధిలోని దుద్దెడ గ్రామంలో కొలువైన పురాతన ప్రాశస్త్యం కలిగిన శైవ క్షేత్రము శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు ఉదయం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను స్థానిక హనుమాన్ దేవాలయం నుండి మేళ తాళాలు, కోలాటం నృత్యాలతో ఎదుర్కోలుగా కళ్యాణ వేదికకు తీసుకొని వచ్చి కళ్యాణ క్రతువును నిర్వహించారు.

స్వామి వారి తరపున గ్రామానికి చెందిన నర్ర సవిత-రాఘవ రెడ్డి కుమార్తె బండి కీర్తి - మాధవ రెడ్డిలు వ్యవహరించగా అమ్మవారి తరపున సికింద్రాబాద్ కు చెందిన నీలిమ - మహేశ్ దంపతులు కన్యాదానం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రముఖులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ వేలేటి రోజా-రాధా కిషన్ శర్మ ఆలయంలో స్వయంభు దేవున్ని దర్శించుకొని పాల్గొని స్వామివారి ఎదుర్కోలు సేవలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో సికింద్రాబాద్ కు చెందిన దాతలు ఉప్పల రాధ,పద్మ,శ్రీనివాస్ ఆలయ ట్రస్టు అధ్యక్షులు మంచాల శ్రీనివాస్,సభ్యులు తాజా మాజీ సర్పం ఆరేపల్లి మహాదేవ్ గౌడ్,పెద్దంకుల శ్రీనివాస్, పెద్ది కుమార్, గోనె శ్రీనివాస్,నూనె కుమార్, వడ్లకొండ శ్రీనివాస్,మంచాల చిన్న శ్రీనివాస్, దేశాయి రెడ్డి,అమిరిశెట్టి వెంకటేశం, మంచాల కృష్ణమూర్తి,పెద్ది నర్సయ్య, అనంతుల నరేందర్, తదితరులు పాల్గొన్నారు.