07-04-2025 06:34:24 PM
ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం అందజేస్తున్న పెళ్లి కానుకను లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సోమవారం కౌటాల, సిర్పూర్ మండల కేంద్రాలలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పథకాల అమలులో పొరపాట్లు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు పుష్పలత శ్రీనివాస్ నాయకులు విజయ్, శ్యామల, గురుదాస్, కవిరాజ్, మధు, అశోక్, నాగేందర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.