calender_icon.png 11 April, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరూరా కల్యాణ వైభోగం

07-04-2025 12:29:52 AM

  1. మైసిగండి, బాలాజీనగర్ ఆలయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు

కల్యాణ వేడుకల్లో  ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతుల పూజలు

కడ్తాల్, ఏప్రిల్ 6 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి రామాలయంలో ఆదివారం  సీతారాముల కల్యాణం  కనుల పండువగా జరిగింది. వేదపండితుల మం త్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణం చూడముచ్చటగా జరిపించారు. స్వామివారి కల్యాణానికి పరిసర గ్రామాల ప్రజలు, ఇతర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చి కళ్యాణం తిలకించారు. భక్తుల సౌకర్యం కోసం దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. 

అదే విధంగా బాలాజీనగర్ తండా జొన్నలరాసి కొండపై ఆలయ ధర్మకర్త బిచ్యా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణం వైభవంగా జరిగింది. మండలంలోని అన్ని గ్రామాల్లో సీతారాముల కళ్యాణం కనుల పండువగా జరిగింది. ఆయా కల్యాణవేడుకల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి,, బిజెపి నేత ఆచారి, పిసిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్,

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా, డిసిసి శ్రీనివాస్ రెడ్డి, బీక్యా నాయక్, మాజీ జడ్పిటిసి దశరథ్ నాయక్, సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచి లక్ష్మీ నర్సింహా రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీచ్యా నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షుడు బాల్ రాజ్, చేగూరు వెంకటేష్, మైసిగండి ఆలయ చైర్మన్ శిరోలి పంతూ, తహశీల్ధార్ జ్యోతి, ఈఓ స్నేహలత, సీఐ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

స్వగ్రామంలో కేంద్ర మంత్రి 

-మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోని కోదండ రామాలయ ప్రాంగణంలో ఆదివారం శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో నిర్వహించిన సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు గంగాపురం కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందె ల శ్రీరాములు, రాష్ట్ర అధికార ప్రతినిధి గం గాపురం వెంకట్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దే వేందర్ రెడ్డి, నాయకులు ప్రతాప్, అమరేందర్ రెడ్డి, గంగాపురం రాజేందర్ రెడ్డి, భిక్ష పతి, మాజీ ఎంపీపీ మంద జ్యోతి పాండు, మాదారం రమేశ్ గౌడ్, ఢిల్లీ వెంకేటేష్ ముదిరాజ్, అశోక్ రెడ్డి, రాము, బీజేవైఎం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ప్రత్యేక పూజలు 

ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆదివారం శ్రీరామ నవమి ఉత్సవాలు ఘ నంగా జరిగాయి. ఆలయాల్లో కన్నుల పండువగా సీతారామ కల్యాణం నిర్వహించారు. భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణ ఉత్సవాల సందర్భంగా అన్నదానాలు చేశారు. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

- కర్మన్ ఘాట్ ఆలయంలో వైభవంగా సీతారాముల కల్యాణం 

చంపాపేట డివిజన్ లోని కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో సీతారాముల క ల్యాణ ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. సీతారాముల వారి కల్యాణంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని, స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

అలాగే, టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని, సీతారాముల కల్యాణం తిలకించారు. కల్యాణ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేద పండితులు ఆశీర్వచనం చేశారు.

రంగాపూర్ ఆంబోత్ తండా గ్రామాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం, శ్రీరాముడి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నా రు. శ్రీ రామ నవమి సందర్బంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని తుర్కయం జాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్, కమ్మగూడ, ఇంజాపూర్ (ఆపిల్ కాలనీ ),రాగన్న గూడా  మంచాల మండలం ఆంబోత్ తండా లోయపల్లి (ధర్మయ్య చెర్వు) గ్రామాల్లో సీతా రామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీరామ నవమి వేడుకలను గ్రామాల్లోకి ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, రంగాపూర్ గుదిబండ రామలింగేశ్వర ఆలయానికి, ఆంబోత్ తండా ధర్మాయచెరువు బుడియాబాపు గుడి వద్దకు రోడ్డు మంజూరు చేయడంతో పాటు దేవస్థానాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, పాండు రంగారెడ్డి బైరిక రమాకాంత్ రెడ్డి, మోతిరాం నాయక్, రాందాస్ నాయక్, చీమల జంగ య్య, కారింగు జంగయ్య గౌడ్, మాధవరెడ్డి, బాలకోటి నాయక్, హరిలాల్ కుమార్, బిచ్య నాయక్, దాసు గౌడ్, శ్రీనివాస్ నాయక్, మారగోని మాసయ్య గౌడ్, బాల్ రెడ్డి, కాళ్ళ చంద్రమ్మ, మార సురేష్, ఏర్పుల సంజీవ, ఏర్పుల రాజు, మంతని శివ, రమేష్, రాంచంద్రి, సింగారం సుమన్, తిరుమలేష్, గణేష్, రామకృష్ణ, చెరుకు నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

 అంబరమంటిన శ్రీరామనవమి వేడుకలు  

 రాజేంద్రనగర్: జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. అంటూ భక్తులు దశరథ తనయుడు నా మాన్ని కీర్తించారు. ఊరువాడ ఎటు చూసి నా సీతారాములను జపించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. రా జేంద్రనగర్, గండిపేట శంషాబాద్ మండలాలు సంబరాలు అమరాన్ని అంటాయి. శంషాబాద్ మండలంలోని నరు కూడా అమ్మపల్లి ఆలయంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు.

ఇస్కాన్ మందిరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

 మేడ్చల్ అర్బన్:మేడ్చల్ మండల పరిధిలోని డబిల్ పూర్ గ్రామ పరిధిలో గల ఇస్కాన్ మందిరంలో గోవింద్ ప్రభు ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భగవాన్ ప్రభుజి  భక్తులకు ప్రవచనాలు వినిపించారు  స్వామివారి కళ్యాణం తదుపరి భక్త జనానికి విందు భోజనం ఏర్పాటు చేశారు

శ్రీ రాముడి దీవెనలు ప్రజలందరిపై ఉండాలి

నాగోల్ డివిజన్ లో జరిగిన కల్యాణ వేడుకల్లో స్వామివారికి పట్టువస్త్రాలు, ము త్యాల తలంబ్రాలు అందజేస్తున్న టీ పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కుటుంబ సభ్యులు.

మన్సూరాబాద్‌లో..

మన్సూరాబాద్‌లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి తదితరులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.