calender_icon.png 27 November, 2024 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిందితుడిని పట్టించిన పెళ్లి కార్డు

27-11-2024 03:49:53 AM

  1. 26 ఏండ్ల క్రితం కొడుకును చంపిన తండ్రి
  2. నాటినుంచి పరారీలోనే హంతకుడు
  3. పేరు మార్చుకునికర్ణాటకలో నివాసం

పుట్టపర్తి/ బెంగళూరు, నవంబర్ 26: ఎంత పెద్ద నేరస్థుడైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, ఏనాటికైనా ఊచలు లెక్కబెట్టా ల్సిందేనని తాజా ఘటన రుజువు చేసింది. భార్యపై అనుమానంతో ఆరునెలల కన్నబిడ్డను  చంపిన ఓ తండ్రిని 26 ఏండ్ల తరు వాత పెళ్లి పత్రిక పట్టించింది. ఏపీలోని సత్యసాయి జిల్లా గుడిబండ మండలం దిన్నే హట్టి గ్రామానికి చెందిన గొల్ల తిప్పేస్వామి, కరియమ్మ భార్యాభర్తలు.

వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కొడుకు శివలింగయ్య(6 నెలలు) తనకు పుట్టలేదని తండ్రి అనుమానిస్తుండేవాడు. ఈక్రమంలో 1998, అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ సందర్భంగా చిన్న కొడుకును తీసుకుని తల్లిదం డ్రులు ఇద్దరు గుడికి వెళ్లారు. ఈ క్రమంలో శివలింగయ్యను తిప్పేస్వామి  పక్కనే ఉన్న మామిడితోటలోకి తీసుకెళ్లి గొంతు పిసికి చంపేసి అక్కడే పాతిపెట్టాడు.

అనంతరం అక్కడి నుంచి పారిపోయి కర్ణాటకలోని హస న్ జిల్లా న్యామన్‌హళ్లి(అర్దూర్)కి వెళ్లాడు. అక్కడ తన పేరును కృష్ణగౌడగా మార్చుకుని తార అనే మహిళను రెండో పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు.వారికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. కొడుకు చనిపోవడంతో మొదటి భార్య కరియమ్మ ఊరు వదిలేసి బెంగళూరు లో జీవిస్తున్నది. పోలీసులు ఎంత వెతికినా నిందితుడైన తిప్పేస్వామి ఆచూకీ లభించలేదు.

దీంతో ఈ  మర్డర్ కేసు అపరిష్కృ తంగా మిగిలిపోయింది. కాలక్రమంలో 26 సంవత్సరాలు గడిచిపోయాయి. తనపెద్ద కుమార్తె సౌమ్యకు పెళ్లి కుదరడంతో దిన్నేహట్టి గ్రామానికి చెందిన తన బాల్య స్నేహి తుడు నాగారాజుకు శుభలేఖను పంపి వివాహానికి రావాల్సిందిగా తిప్పేస్వామి కోరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు భూమి వివాదం పరిష్కారం నెపంతో గ్రామానికి రప్పించారు. నిందితుడు తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడ తన స్వగ్రామానికి రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు.