calender_icon.png 30 March, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభ జరుగుతున్న తీరు దురదృష్టకరం

27-03-2025 01:52:24 AM

ఎమ్మెల్యే కూనంనేని 

హైదరా బాద్, మార్చి 26 (విజయక్రాంతి): అసెంబ్లీ నడుస్తున్న తీరు ఏ మాత్రం బాగోలేదని సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ సభను వీధి పోరాటంలా మార్చడం సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నదున్నట్టుగా కొనసాగిస్తే ప్రభుత్వంపై ఊహించని భారం పడుతుం దన్నారు.

ఎకరా భూమికి సాగునీరు అందించేందుకు రూ.40లక్షలు ఖర్చుచేయాల్సి వస్తుందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు ద్వా రా ఎకరాకు రూ.10వేలు మాత్రమే ఖర్చు అవుతుందన్నారు. అందుకే కాళేశ్వరం బదులుగా ప్రాణహితే చేవెళ్ల ప్రతిపాదిత స్థలం తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకువస్తే భారం తగ్గేఅవకాశముందన్నారు.

పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టుకు ఇప్పటివరకు 35 వేల కో ట్లు ఖర్చు చేసినప్పటికీ కాల్వలు తీయకపోవడంతో ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేకపోయారన్నారు. దీనిపై మంత్రి సమాధానం చెప్పాలన్నారు.