07-02-2025 12:02:34 AM
సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య
గజ్వేల్, ఫిబ్రవరి 6 : గజ్వేల్ నియోజకవర్గం లోని జగదేవ్పూర్, మర్కుకు మండలాల్లో నెలకొన్న తాగునీటి సమ స్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం సిద్ది పేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సంద బోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం గజ్వేల్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత రెండు నెలలుగా మిషన్ భగీరథ ప్రజల అవసరా లకు సరిపడా సరఫరా చేయడం లేదన్నారు. మర్కుకు మండలం దామరకుంట, కాశిరెడ్డిపల్లి, వరదరాజపురం, కర్కపట్ల, జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల, కొత్తపల్లి, చాట్లపల్లి, వట్టిపల్లి, పలుగడ్డ, మాందాపూర్, కొండాపూర్ తదితర గ్రామాలకు నీటిని సరఫరా చేయడం లేదని వేసవి ప్రారంభం కాకముందే గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
నియోజకవర్గంలోని కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా గ్రామాలకు పూరి స్థాయిలో నటిసి రహదా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
గజ్వేల్ నియోజకవర్గం లోని అనేక గ్రామాలు పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి జరిగినా కొద్దీ గ్రామాల్లో పట్టణ వాతావరణం పెరిగిందని, ప్రజలు రోజువారి తాగడానికి మరియు గృహ అవసరాలకు అవసరపడే విధంగా నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రజలను సమీకరించి ఖాళీ బిందెలతో ఆర్డీవో కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.