07-04-2025 12:33:21 AM
ఎమ్మెల్యేను కోరిన ఆర్టీసీ డీఎం, సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే
కామారెడ్డి, ఏప్రిల్0 6 ( విజయక్రాంతి): కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ కరుణ శ్రీ ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ గా బాధ్యతలు చేపట్టిన కరుణశ్రీ ఎమ్మెల్యే కా టిపల్లి వెంకటరమణారెడ్డిని కలిసి బస్టాండ్ లో నీటి సమస్య ను పరిష్కరించాలని కోరారు.
నీటి సమస్యతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సానుకూలంగా స్పందించారు. బస్టాండ్ లో ప్రయాణికులకు నీటి సమస్య లేకుండా బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎం కరుణశ్రీ ,ఆర్టిసి డిపో అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి, లు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల కామారెడ్డి డిఎం గా పని చేసిన ఇందిరా డిమోషన్ లో వెళ్లలేదని సాధారణ బదిలీలో భాగంగా హైదరాబాద్ ఆర్టీసీ హెడ్ ఆఫీస్ కు డి ఎం ఇందిరా బదిలీ అయినట్లు డి ఎం కరుణశ్రీ విజయ క్రాంతి తో తెలిపారు.
ఎవరో కొందరు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల కొన్ని పత్రికల్లో ఇక్కడ పని చేసిన డిఎం ఇందిరా డిమో షన్ పై వెళ్లినట్లు వచ్చిన వార్తలను ప్రస్తుత డిపో మేనేజర్ కరుణశ్రీ ఖండించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆర్టీసీ అధికారులు జయరాం, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.