calender_icon.png 18 March, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా కాళ్లకు చెప్పులు లేవు.. చేతిలో చిల్లిగవ్వ లేదు!

09-03-2025 01:20:00 AM

‘2009 నుంచి జరుగుతున్న ఉద్యమంలో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. చనిపోయిన వాళ్లు పిరికివాళ్లే కావొచ్చు. అవగాహన లోపం ఉండొచ్చు.. కాని, వారి చావులను అవమానపరిచి వారిగురించి మాట్లాడకుండా ఉండటం అమానవీయమే అవుతుంది. ఒక ప్రాంత ఆకాంక్షను, ఉద్యమాన్ని చిన్నచూపు చూడటంలో నిరాశా, నిస్పృహలకు గురై ప్రాణాలు పోగొట్టుకున్నవారి చావుకు ఎవరు కారణం అన్నది విశ్లేషించుకోవా’లని అన్నారు మలిదశ ఉద్యమకారిణి, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ సూరంపల్లి రజిని. ప్రస్తుతం ఆమె మహబూబియా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నాటి ఉద్యమ అనుభవాలను విజయక్రాంతితో పంచుకున్నారిలా.. 

1995లో వరంగల్ డిక్లరేషన్ అనేది తెలంగాణ అంశాన్ని ముందుకు తెచ్చింది. మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ కలిసి దానిని నిర్వహించారు. వరంగల్ డిక్లరేషన్ నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. వరంగల్ డిక్లరేషన్ తర్వాతనే తెలంగాణకు సంబంధించి.. ఒక ఆర్గనైజేషన్, సంఘాలు ఉండాలనే ఒక ఆలోచనతో తెలంగాణ జన సభ 1998లో ఏర్పడ్డది. తెలంగాణ జన సభలో మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తు లు ఉన్నారు. దీనికి అనుబంధంగా ఉన్నది తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ (టీఎస్‌ఎఫ్). తర్వాత తెలంగాణ కళ సమితి. అట్లా జనసభకు అనుబంధంగా విద్యార్థి సంఘం, మరొకటి కళాకారుల సంఘం ఏర్పడింది. అయితే, అది పురుడుపోసుకోవడం మొదలు పెట్టిన సంవత్సరంలోనే నిర్బంధాన్ని ఎదుర్కొవాల్సిన పరిస్థితి వచ్చింది. 

నిర్బంధాలు, అరెస్టులు 

ఆంధ్రా ప్రాంతానికి మనకు తేడా స్పష్టం గా కనిపించేది. ఆనాడు టీఎస్‌ఎఫ్ విద్యార్థు లు జిల్లా స్థాయిలో సమస్యల పట్ల సీరియస్‌గా పనిచేస్తుండటంతో విద్యార్థులను కొట్ట డం, నిర్బంధించడం, అరెస్టులు చేయడం, టీఎస్‌ఎఫ్‌లో ఉండబోమని విద్యార్థులతో రాజీనామా చేయించడం వంటి పరిస్థితులు ఉండేవి. 2001లో నిజామాబాద్‌లో టీఎస్‌ఎఫ్ తరపున క్లాసులు నిర్వహించాం. మొట్ట మొదటిసారి నేను ఆ క్లాసులకు అటెండ్ అయ్యా. ఆ క్లాసుల్లోనే ప్రత్యేక రాష్ట్రం అవసరాన్ని తెలుసుకున్నా. అప్పటి నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన. హైదరాబాద్‌లో ఉన్న కాలేజీలు, పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌లో ‘ఎందుకు తెలంగాణ?’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించాం.  

ప్రతి కాలేజీలో ఆ పాట  

ఆ రోజుల్లో యువత ఎక్కువగా కోరుకున్నది ఉద్యోగాలే. మేం కాలేజీలకు వెళ్లినప్పుడు ‘ఓ ఉద్యోగమా.. నీ చిరునామా ఏది? ఓ ఉద్యోగమా.. నీ చిరునామా ఏది?’ అనే పాట పాడేది. ఈ పాట అప్పట్లో చాలా ప్రచారంలో ఉంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం చాలా స్పష్టంగా కనిపిం చేది. తెలంగాణ ప్రభుత్వ బడులకు, ఆంధ్రాలోని ప్రభుత్వ బడులకు.. ఇక్కడున్న టీచింగ్ ఫ్యాకల్టీకి.. అక్కడున్న టీచింగ్ ఫ్యాకల్టీకి తేడా కనిపించేది. అక్కడ ప్రతి సబ్జెక్టుకు టీచర్ ఉన్నాడు.. ఇక్కడ ప్రతి సబ్జెక్టు టీచర్ ఉండకపోయేది. తెలంగాణలో కాలేజీలు.. స్కూళ్లలో ఫ్యాకల్టీ సమస్య ఉండేది. ఫ్యాకల్టీ నియమించాలని ధర్నాలు చేసేది. అలా 2000 సంవత్సరం నుంచి మొదలు పెడితే అనేక పోరాటాలు చేశాం. అవి విద్యార్థుల సమస్యలు, హాస్టల్ సమస్యలు కావచ్చు. ఉద్యమాలు చేస్తున్న క్రమంలో అనేకసార్లు అరెస్టులు అయ్యాం. 

పోలీసుల సహకారం 

యూనివర్సిటీలో పీజీ చదువుతున్న క్రమంలో మళ్లీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. 2007 08 సమయంలో జా యింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఆ రోజు రాస్తారోకోలు, ర్యాలీలు, అనేక పోరాటాల్లో పాల్గొని ముందు కు పోతున్న క్రమంలో 2009 డిసెంబరు ౨ను ఎప్పటికీ మరిచిపోలేం. ఆ ముందు రోజు ఆర్ట్స్ కాలేజీ మొత్తం ఒక నిర్బంధ పరిస్థితి.. క్యాంపస్ లోపలికి ఎవ్వరినీ రానివ్వకుండా.. అక్కడ ఉన్న వాళ్లమే ఆర్ట్స్ కాలేజీ ముందు రాత్రాంతా జాగారం చేసి పాటలు పాడాం.. ర్యాలీలు, మానవహారాలు, ధర్నాల మధ్య చిదంబరం డిక్లరేషన్ వచ్చింది.

చిదంబరం ప్రకటన.. 

డిసెంబర్ ౯.. నాటి కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన తిరిగి తెలంగాణ ప్రాంతానికి ఒక కొత్త ఊపిరిలూదింది. కాని, ఆ ఆశలు నిలువక ముందే మళ్లీ ఆంధ్రా రాజకీయ పార్టీలు బరిలోకి దిగి ప్రకటన వెనుకకుపడేట్టు చేశాయి. 2009 మధ్యకాలంలో కాంట్రాక్టు లెక్చరర్స్‌గా సకలజనుల సమ్మెలో పా ల్గొన్నాం. అప్పుడున్న దాంట్లో ఐక్యకార్యాచరణ కమిటీలో పనిచేయడం.. అన్నీ ప్ర జాసంఘాలతో కలిసి పనిచేసిన. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించాక రాజకీయ పార్టీల ద్వారా పరిష్కారమవుతుందని అనేక ప్రయత్నాలు ఎన్నికల్లో నడిచాయి. ఏ పార్టీ కూడా తెలంగాణ అజెండా ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకుండా పోటీ చేయలేదు. ప్రతి పార్టీ కూడా తాము తెలంగాణకి వ్యతిరేకం కాదు అని చెప్పే స్థితికి ఉద్యమాన్ని తీసుకొచ్చాం. ఈ విషయం చెప్పడానికి కూడా మనకు పరకాల ప్రభాకర్, లగడపాటి, కాపూరి, కేసీఆర్‌లు కావాలా? విధిలేని పరిస్థితిలో కేసీఆర్ నిరాహార దీక్షకు కూర్చోవడం.. ఉద్యమం ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చడం అందరికీ తెలిసిందే. 

మన యాస మన బతుకు

ఇకనైనా తెలంగాణ భాషల రాయం డ్రి, తెలంగాణ భాషల మాట్లాడుండ్రి, తె లంగాణ బతుకు బతుకుండ్రి. మన బతుకులను అన్యాయం చేసి, దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరమాలె. మన ప్రాంతంవాడే దోపిడీ చేస్తే.. ప్రాణంతోటే పాతర పెట్టాలె. అంత అగ్వకున్నదా తెలంగాణ భాష..? ఇగ సహిం చవద్దు. నేను గిట్లనే మాట్లడ్త, గిట్లనే రాస్త. మన యాసల్నే మన బతుకుతున్నది.  

 కాళోజీ నారాయణరావు, కవి

- రూప