19-04-2025 12:00:00 AM
నగరంలో పలు మసీదుల వద్ద ముస్లింల నిరసన
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18(విజయక్రాంతి) : నగరంలో పలు మసీదుల వద్ద శుక్రవారం నమాజ్ ముగిశాక ముస్లీంలు నిరసన తెలిపారు. వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. బీజేపీ కుట్ర పూరితంగా వక్ఫ్ బిల్లును రూపొందించిందని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంటనిప్రశ్నించారు.