calender_icon.png 20 April, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలి

15-04-2025 12:00:00 AM

ఆదిలాబాద్ పర్యటనలో ఎమ్మెల్సీ ఆమెర్ ఆలీ ఖాన్  

ఆదిలాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి):  ముస్లింలకు అన్యాయం చేసే వక్ఫ్ బిల్ సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఎమ్మెల్సీ ఆమెర్ ఆలీ ఖాన్ డిమాండ్ చేసారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవా రం వివిధ కార్యక్రమాల్లో కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.

ముందుగా ఆదిలాబాద్‌లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని, ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధం గా జైబాపు, జై భీం, జైసంవిధాన్  ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విదంగా చాందా (టీ) గ్రామంలోని రాజన్ షా వలి దర్గాను ఎమ్మెల్సీ సందర్శించి, దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి, చాదర్ పూల్ సమర్పించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేంగా ముస్లీంలు చేపట్టిన నిరసనకు ఎమ్మెల్సీ సంఘీభావం తెలిపారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆమెర్ ఆలీఖాన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్షగట్టి వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చిందన్నారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ నియోజక వర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.