calender_icon.png 3 April, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ బద్ధమే

03-04-2025 01:43:02 AM

లోక్‌సభలో ఓటింగ్

వక్ఫ్ సవరణ బిల్లు

అనుకూలం : 226

వ్యతిరేకం : 163

గైర్హాజరు : 1

మొత్తం : 390

స్పష్టంచేసిన హోంమంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆయన ఈ బిల్లు ప్రవేశపెడుతూ.. ఈ బిల్లు వల్ల పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. తర్వాత లోక్‌సభలో ఈ సవరణ బిల్లుపై అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సుదీర్ఘంగా చర్చ జరిగిం ది.

చర్చ సందర్భంగా ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య వాదోపవా దనలు చోటుచేసుకున్నాయి. బీజేపీ నేతలు ఈ బిల్లు వల్ల మేలు జరుగుతుందని చెప్పగా.. ముస్లిం సామాజిక వర్గాన్ని అణచివేసేందుకే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. ఎన్డీఏ కూటమి పార్టీలు బిల్లుకు ఆమోదం తెలుపగా, ఇండియా కూటమి మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

వైఎస్సార్‌సీపీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించింది. సభలో చర్చ సందర్భంగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అసహనం వ్యక్తం చేశారు. ఆయన తన చేతిలోని పేపర్లను చింపేశారు. ఈ తీరును ఎంపీ జగదాంబికా పాల్ తప్పుబట్టారు. అసదుద్దీన్ వ్యవహారం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ బిల్లును నేడు పెద్దల సభలో ప్రవేశ పెట్టనున్నారు.  

 ఇది పెద్ద సంస్కరణ: అమిత్ షా

సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాట్లాడారు. ‘వక్ఫ్ బిల్లు అనేది అతిపెద్ద సంస్క రణ. రాజ్యాంగ బద్ధమే. ముస్లిం మతపరమైన కార్యక్రమాల్లో ముస్లిమేతరులు పాల్గొ నేలా కొత్త చట్టంలో ఎటువంటి సవరణ చేయలేదు. ఇలా మేము ఎప్పటికీ చేయం. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయం కో సం మైనార్టీలను తప్పుదోవ పట్టించాయి.

వారిలో భయాందోళనలు కలుగజేశాయి. బోర్డులో ఉండే ముస్లిమేతరులు ముస్లింల మతపరమైన విషయాల్లో తలదూర్చరు. వారు మొత్తం వ్యవస్థ ఎలా నడుస్తుందని మాత్రమే పరిశీలిస్తారు. వక్ఫ్ బోర్డుల కింద ఉన్న భూములు, నిధులు, బోర్డుకు వచ్చే విరాళాలు మొదలయినవి చూసుకుంటారు. బోర్డు పనులను పర్యవేక్షిస్తారు.

వక్ఫ్ సభ్యు లు చట్టప్రకారం నడుచుకుంటున్నారా లేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారా అని ముస్లిమేతరులు పర్యవేక్షిస్తారు. అవసరం ఉన్న పేద ముస్లింలకు, ముస్లిం వర్గాల కు విరాళాలు ఉపయోగపడుతున్నాయా లేదా అని మాత్రమే వీరు పర్యవేక్షిస్తారు. ఈ సభ ద్వారా ఈ దేశంలోని ముస్లింలకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.

ఒక్క ముస్లిమేతరుడు కూడా వక్ఫ్‌లోకి రాడు. ఈ చట్టంలో ఇటువంటి ప్రతిపాదనేదీ లేదు. కొంత మంది వక్ఫ్ ఆస్తులను వందల సంవత్సరాలకు లీజుకు తీసుకుని అనుభవిస్తారు. వక్ఫ్ బోర్డుకు వచ్చే ఆదాయం క్రమంగా తగ్గిపోతుంది. ఈ ఆదాయంతో మైనార్టీలు అభివృద్ధి చెందే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చు.

అలా బోర్డుకు సక్ర మంగా చెల్లింపులు చేయని వారిని ఈ కొత్త వక్ఫ్ బోర్డు లేదా కౌన్సిల్ గుర్తిస్తుంది. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు కోసం దారుణాలు చేసింది. వక్ఫ్ బోర్డు సమస్యల గురించి కోర్టుకు వెళ్లకుండా చట్టం చేసింది. కానీ ఇప్పుడు వక్ఫ్‌కు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే నిరభ్యం తరంగా కోర్టుకు వెళ్లొచ్చు.

మెజారిటీ వర్గాల వారు వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపారు. వక్ఫ్ బోర్డు పేద ముస్లింల కోసం ఉంది. దొంగల కోసం ఈ బోర్డు లేదు. ప్రతిపక్షాలు ఈ బిల్లు మీద దుష్ప్రచారం చేశాయి. లేనిపోని అపోహలు కల్పించాయి. ప్రజల్లో గందరగోళం సృష్టించాయి. ఈ బిల్లుపై చర్చ మొదలైనప్పటి నుంచి నేను గమనిస్తున్నా ఈ చట్టంపై అనేక మంది సభ్యుల్లో అనేక అపోహలు ఉన్నాయి.

1995 వక్ఫ్ చట్టం ప్రకారం ప్రభుత్వం లేదా ఇతరులకు వక్ఫ్ ఆస్తులను ధారాదత్తం చేయడం నిషేధం. ప్రతిపక్షాలు దేశం మొత్తం తప్పుడు ప్రచారం చేసి.. ప్రజ ల్లో అపోహలు కల్పించాయి. వక్ఫ్ బోర్డులో ఉన్న అవినీతిని అంతం చేసేందుకే ఈ బిల్లు తీసుకొచ్చాం. మీరు 2013లోనే ఈ సవరణలు చేసుంటే ఇప్పు డు ఈ బిల్లు అవసరం ఉండేది కాదు.

2014 ఎన్నికలకు ముందు న్యూఢిల్లీలోని 123 విలువైన స్థలాలను కాం గ్రెస్ వక్ఫ్ బోర్డుకు అప్పగించింది. అంతే కాకుండా కాంగ్రెస్ రైల్వే భూములను కూడా వక్ఫ్ బోర్డుకు అప్పగించింది. పరిపాలనా సౌలభ్యం కోసం వక్ఫ్ బోర్డులో ముస్లింలు కాని వారిని కూడా నియమించవచ్చు.

హిం దూ ఇతర మతాలకు చెందిన సంస్థలకు వేరే మతస్తులు కమిషనర్లుగా ఉండట్లేదా? మీరు (కాంగ్రెస్) 2013లో సవరణలు చేసి ఈ చట్టాన్ని ఇంతలా తయారు చేసి ఉండకపోతే ఈ బిల్లు అవసరమే లేదు.’ అని పేర్కొన్నారు. 

కన్నడ హైకోర్టు ఆపింది

అమిత్ షా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆరోపణలు చేశారు. ‘అక్కడి ప్రభుత్వం విలువైన భూములను వక్ఫ్ బో ర్డుకు తక్కువ ధరకు లీజుకు ఇచ్చేందుకు ప్ర యత్నిస్తే హైకోర్టు ఆపింది. ఎన్నికల్లో గెలుపు కోసమే కాంగ్రెస్ ఇలా చేస్తోందనుకుంటా. దేశంలోని ఎన్నో చర్చిలు వక్ఫ్ బిల్లుకు మద్దతిస్తున్నాయి. ఈ నాలుగు సంవత్సరాల్లో ముస్లింలకు కూడా ఈ బిల్లు వల్ల కలిగే ప్ర యోజనాల గురించి అర్థం అయింది.

వేరే వర్గానికి చెందిన కొన్ని ఆస్తులను వక్ఫ్ భూములుగా ప్రకటించారు. ప్రయాగ్‌రాజ్‌లో చంద్రశేఖర్ ఆజాద్ పార్క్‌ను కూడా ఇలాగే ప్రకటించారు. ముస్లింలు ప్రకటించే విరాళాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. దేశాభివృద్ధికి వక్ఫ్ బిల్లు వల్ల కలిగే దుష్ప్రయోజనాలను బీజేపీ తొలగించింది. కొత్త బిల్లు వల్ల ఎటువంటి మతపరమైన ఉద్రిక్తతలకు ఆస్కారం ఉండదు.’ అని తెలిపారు

లాలూ కోరిక నెరవేరింది

మోదీ ప్రభుత్వం లాలూ ప్రసాద్ యాద వ్ కోరికను నెరవేర్చిందని అమిత్ షా తెలిపారు. ఆయన వక్ఫ్‌ను నియంత్రించేందుకు కఠినమైన చట్టం ఉండాలని కోరుకు న్నారు. ఆయన కోరికను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. ప్రజలు కోర్టులో సవాలు చేసే అధికారం లేకుండా మీరు (ప్రతిపక్షాలనుద్దేశించి) ఎలా చేస్తారు? ఒక సభ్యుడు ఈ బిల్లు ను మైనార్టీలు అనుమతించరని అంటాడు.

మీరు అంత పెద్ద మాట ఎలా అనగలరు. ఇది భారత ప్రభుత్వ చట్టం. పార్లమెంట్ ఆమోదించిన చట్టం. ప్రతి ఒక్క రూ దానిని అంగీకరించాల్సిందే. భారత ప్ర భుత్వం ఆమోదించిన చట్టాన్ని అంగీకరించం అనే ధైర్యం ఏ పౌరుడికి ఉండకూడదు. ఈ బిల్లు పేద ముస్లింల భూములను కాపాడుతుంది. 1913 నుంచి 2013 వరకు వక్ఫ్ బోర్డు కింద 18 లక్షల ఎకరాల భూములు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 39 లక్షల ఎకరాలు ఉన్నాయి.’ అని తెలిపారు. 

రాజ్యాంగాన్ని బలహీనపరిచేందుకే..

‘బీజేపీ దేశ రాజ్యాంగాన్ని బలహీనపరిచేందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టింది. భార తీయ సమాజాన్ని విభజించి.. మైనార్టీలను మరింత తక్కువ చేసేందుకు బీజేపీ యత్నిస్తోంది. బిల్లును జేపీసీకి పంపామని ప్రభు త్వం చెబుతోంది. కానీ జేపీసీలో ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఈ రోజు ఒక వర్గాన్ని బీజేపీ టార్గెట్ చేస్తుం ది.

రేపు మరో వర్గాన్ని టార్గెట్ చేసే అవకా శం ఉంది.’ అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగో య్ హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ ఎంపీ వే ణుగోపాల్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ఆరెస్సెస్ అజెండాను అమలు చేస్తోంది. దేశం లోని మత స్వేచ్ఛపై దాడి చేసే కుట్ర. దేశప్రజలను మతం పేరుతో విభజించేందుకే ఈ బిల్ తీసుకొచ్చారు.’ అని ఫైర్ అయ్యారు.

సహజ న్యాయ సూత్రాలకు బిల్లు విరుద్ధం: అసద్

‘ఈ బిల్లు ముస్లింలపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడి. మా మసీదులను మోదీ ప్ర భుత్వం టార్గెట్ చేసింది. ముస్లిం వక్ఫ్‌లోకి ముస్లిమేతరులను తీసుకురావడం.. మిగతా మతాల బోర్డులు నడిచే తీరుకు ఇది పూర్తిగా విభిన్నం. సహజ న్యాయ సూత్రానికి ఇది వి రుద్ధం. ఆర్టికల్ 25, 26ను ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. ఈ బిల్లు గనుక పాస్ అయితే కేవలం పురాతన దేవాలయాలు మాత్రమే రక్షించబడతాయి.

మసీదులు రక్షణ కోల్పోతాయి. కలెక్టర్ ఈ స్థలం ప్రభుత్వ ఆస్తి అంటే అప్పుడు మసీదు ప్రభుత్వ ఆస్తి అయిపోతుందా?. మీరు ఈ రోజు మహిళా సాధికా రత గురించి బాగా మాట్లాడుతున్నారు. బిల్కిస్ బానో గురించి కూడా మీరు ఇలాగే ఆలోచించి ఉంటే బాగుండేది.

మీ ఉద్దేశం ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయడమే. నేను ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నా.  బి ల్లు ద్వారా పేద ముస్లింలకు ఏ మాత్రం ప్ర యోజనం చేకూరదు.’ అని ఎంఐఎం ఎం పీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ప్రసంగిస్తున్న సమయంలో చేతిలోని పేపర్లను చించేశారు. 

షా x అఖిలేష్ 

బిల్లుపై చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అఖిలేష్ యాదవ్ మాట్లా డుతూ.. ‘ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతుంది.’ అని విమర్శించారు. దీనిపై కేంద్ర హోం మంత్రి షా నవ్వుతూనే తనదైన రీతిలో కౌంటర్ వేశారు. ‘కొన్ని పార్టీల నాయకత్వం ఐదుగురి చేతుల్లోనే ఉంటుంది.

ఆ ఐదుగురి నుంచే కొత్త అధ్యక్షులు వస్తారు. కానీ మేం ఓ ప్రక్రియను పాటించాలి. దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలను వడపోసి.. అందులోనుంచి ఒకరిని ఎంపిక చేయాలి. అందుకోసం సమయం పడుతుంది. మీకు సమయం పట్టే అవకాశం లేదులే’ అని అన్నారు. 

పార్లమెంట్ భూమీ వక్ఫ్‌దే అంటారేమో.. 

కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత మాట్లాడారు. ‘జేపీసీలో మొత్తం 284 మంది ప్రతినిధులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డులు వాదనలు వినిపించాయి. బిల్లులో అనేక సానుకూల మార్పులు చేస్తే మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు. ఈ బిల్లు ముస్లిం సమాజానికి, ముస్లిం మత విశ్వాసాలకు ఎటువంటి ఆటంకం కలిగించదు. ఈ బిల్లు లేకపోతే కొంత మంది పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తి అని అంటారు.’ అని రిజిజు తెలిపారు. 

 బీజేపీ మైనార్టీలను టార్గెట్ చేసింది: ఖర్గే 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వక్ఫ్ బిల్లుపై ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. బీజేపీ దేశంలోని మైనార్టీలను టార్గెట్ చేసింది. చాలా కాలంగా బీజేపీ మైనార్టీలను సెకండ్ క్లాస్ పౌరులుగా భావిస్తోంది. ఇప్పుడు ఈ బిల్లు ద్వారా వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ ఆరెస్సెస్, బీజేపీ విభజన రాజకీయాలను అస్సలుకే సమర్థించదు. ఈ చర్యలు చట్టానికి విరుద్ధం’ అని బీజేపీపై ఫైర్ అయ్యారు