12-04-2025 12:14:03 AM
మఠంపల్లి, ఏప్రిల్ 11: మఠంపల్లి మండలంలో ఉన్న మర్కస్ మస్జిద్ వద్ద వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో మౌలానా అబ్దుల్ ఖాదిర్ సాహెబ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా అలాగే ముస్లిమ్ హక్కులను కాలరాస్తూ వికృత చేష్టలకు ఒడిగట్టిందని తెలిపారు.
తమ పూర్వీకులు స్వంత లాభం మానుకొని తమ ఆస్తులను వక్ఫ్ కొరకు ఇచ్చినారని,ఇప్పుడు ఆ చట్టం ద్వారా అలాంటి ఆస్తులు ప్రమాదంలో పడుతున్నాయని దానీ వల్ల మేలు జరిగే విషయంలో వ్యతిరేకంగా కేంద్రము తమ వక్ఫ్ బోర్డు నుంచి లాక్కునే విధంగా నల్ల చట్టాలను మా మీద రుద్దుతున్నారని తేలిపోయారు.
13వ తారీఖున కార్యక్రమంలో ఈ బిల్లు కు వ్యతిరేకంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపాలని మఠంపల్లి మండల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్ డి.వహాభ్ కోరారు.కార్యక్రమంలో మౌలానా అబుల్ రహమాన్ సాహెబ్, మౌలానా షకీల్ సాహెబ్, హాఫిజ్ ఇమామ్ అలి,హఫీజ్ సుభని సాహెబ్, జానీ,జహంగీర్, రిజ్వాన్,మధర్ సాహెబ్, సుభని,ఉమర్,హాసన్ మియ,హుస్సేన్,నజీర్ తదితరులు పాల్గొన్నారు.