calender_icon.png 22 April, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలి

22-04-2025 01:43:20 AM

మానుకోటలో భారీ నిరసన ర్యాలీ 

మహబూబాబాద్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం సవరించిన వక్ఫ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డు మహబూబాబాద్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

నల్ల జెండాలు, జాతీయ పతాకాలతో జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముస్లిం పెద్దలు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, వామపక్ష పార్టీల నేతలు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ , కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, సిపిఐ కార్యదర్శి విజయ సారథి, సిపిఎం కార్యదర్శి సాదుల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, కిసాన్ పరివార్ సీఈవో డాక్టర్ వివేక్  తదితరులు, ఆయా పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.