calender_icon.png 26 April, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ చట్టం సరైందే..

26-04-2025 01:19:59 AM

సుప్రీంలో కౌంటర్ దాఖలు చేసిన కేంద్రం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వక్ఫ్ (సవరణ) చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ చట్టంలో చేసిన పలు రకాల సవరణలు మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నట్టు తప్పుడు ఆరోపణలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారని కేంద్రం ఆరోపించింది.

ఆర్టికల్ 32 ప్రకారం ఏదైనా చట్టాన్ని సుప్రీం కోర్టు సమీక్షించవచ్చని కేంద్రం తెలిపింది.  1332 పేజీలతో ఉన్న కౌంటర్ అఫిడవిట్‌ను కేంద్రం సమర్పించింది. పాత రోజుల్లో ఉన్న నిబంధనలతో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం జరిగగిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విన్నవించింది.

వక్ఫ్ (సవరణ) చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 72 పిటిషన్లు దాఖలు కాగా.. ఈ పిటిషన్లపై 17వ తేదీన సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సమాధానం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజులు గడువు కోరగా.. సుప్రీం అంగీకారం తెలిపింది. ఈ కేసు తేలే వరకు వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను ఎవరినీ నియమించవద్దని సుప్రీం స్పష్టం చేసి.. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది.