26-03-2025 01:44:33 AM
చిట్యాల, మార్చి 25(విజయ క్రాంతి): ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రతను కల్పించాలని సిపిఎం పార్టీ చిట్యాల కార్యదర్శి చింతల రజనీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆశ వర్కర్లు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపి మాట్లాడారు.
వేతనాల అమలు కోసం ఆశా వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో ఆందోళనలు చేస్తున్నాయన్నారు. 45వ, 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల ప్రకారం పెన్షన్, సామాజిక భద్రత, ఇతరత్రా ప్రయోజనాలను ఆశా కార్యకర్తలకు కల్పించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో రాధిక, స్వప్న, సరోజన, మానస, సాయివేద, సుమలత, కృష్ణవేణి, విజయ, కవిత, జ్యోతి, స్రవంతి, రమ, కల్పన, భాగ్యలక్ష్మి, ప్రమీల సునీత తదితరులు పాల్గొన్నారు.