calender_icon.png 16 March, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్గళి నారాయణుని వ్రతం

16-12-2024 12:00:00 AM

ఈ చిత్రాన్ని శ్రీరంగనాథ స్వామి ఆలయం (సికింద్రాబాద్ ఆర్‌పీ రోడ్)లో చూడవచ్చు. 

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్

నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్

కూర్వేల్ కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్

ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం

కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్

నారాయణనే నమక్కే పఱైతరువాన్

పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ (తమిళ) 

గోదా గోవింద గీతం

మార్గశీర్షపు వెన్నెలలోన తెల్లవారకమున్నె యముననీట 

భక్తి భాగ్యాల మునిగితేల రారండు, వ్రేపల్లె పడుచులార

వేలాయుధమ్ముదాల్చి నందనందనుడదిగో నిలిచినాడు

వేయికన్నులార్పక కాచు వేలుపతడని తెలియరో కొమ్మలార

యశోద ఒడిలోని కొదమసింగము వాడు, కలువకన్నుల రేడు

కారుమబ్బుమేనివాడు, చంద్రసూర్య చలువకాంతుల జల్లువాడు

వరద వాత్సల్యగుణాభిరాముడు నారాయణుడు, నెల నోము పట్టి 

కలిసి భజింతము రండు, పరై వరాల కలిమి కైవల్యమిచ్చునతడు (తెలుగు)

ఇది మార్గళి నెల (మార్గళి త్తింగళ్) చం ద్రుడు పదహారు కళలతో పూర్తిగా వికసించిన మంచిరోజు (మది నిఱైంద నన్నాళాల్) స్నానం చేయదలిచిన వాళ్లు (నీరాడ ప్పోదు వీర్) రండి (పోదుమిన్) అందమైన ఆభరణాలు ధరించిన సుదతు లారా (నేరిళైయీర్) సిరిసంప దలతో కూడిన (శీర్ మల్గుం) గొల్లపల్లెలోని (ఆయ్ ప్పాడి) భగవద నుగ్రహమనే సంపదను, ధనధాన్యా లనే సంపదను (శెల్వచ్చిఱుమీర్గాళ్) వాడియై న శూలం ధరించి (కూర్వేల్) శ్రీకృష్ణుడికి హాని చేయదలిచిన దుర్మార్గులను క్రూరంగా నిర్జించే (కొడుం దోళిలన్) నందగోపుని కుమారుడు (నంద గోపన్ కుమరన్) అంద మైన నయనాలతో కూడి (ఏరారంద కణ్ణి) తల్లి యశోదకు (యశోదై) సింగపు పిల్ల వంటి వాడు (ఇళమ్ శింగం) నల్లని మేనిరంగు కలిగి (కార్మేని) కెందామరలతో పోలిన కన్ను లు (చ్చెంగణ్) ప్రకాశంలో సూర్యుడిని (కది ర్) చల్లదనంలో చంద్రుడిని (మదియం) పోలిన ముఖబిం బము గలవాడు (పోల్ ముగత్తాన్) భగవా నుడైన శ్రీమన్నారాయ ణుడే (నారాయణనే) పఱై అనే వాయిద్యాన్ని మన అభీష్ఠాలను (పఱై) ప్రపంచంలోని ప్రజ లంతా (పారోర్) ప్రశంసించే విధంగా (పుగళ ప్పడిందు) ఈ వ్రతంలో పాల్గోనే విధంగా పావై వ్రతాన్ని అనుష్టించడానికి సిద్ధంగా ఉన్న మనకు (ఎమ్బావాయ్ నమక్కే) అనుగ్రహిస్తాడు (తరువాన్).

ఇతడొకడే సర్వేశ్వరుడు

వేద, రామాయణ, వ్యాస కృత భాగవత, మహాభారత, దివ్య ప్రబంధములైన ద్రావిడ భాషలలో (తమిళ) వాఙ్మయం నుంచి సారాంశం ఏర్చికూర్చిన ఎనిమిది పంక్తుల అద్భుత గీతం ‘తిరుప్పావై’. ప్రపంచమంతా శ్రీవైష్ణవ ఆలయాలలో నెల రోజులు ధను ర్మాస పండుగలే. నిరంతరం శ్రీకృష్ణుని కీర్తనే. ఇది నా ఆలోచనే కాని గోదమ్మ అద్భుత కావ్యానికి అనువాదం చేసే ధైర్య సాహసాలు నాకు లేవు. కానే కాదు, ప్రముఖ పండితులు తప్ప ఇతరులెవరూ గొప్పగా చెప్పగలరో తెలియదు.

పరమ పదానికి చేరిన శ్రీ భాష్యం అప్పలాచార్యులు తిరుప్పావైకి అద్భుతమైన వివరణ వ్యాఖ్యానాన్ని రచించారు. వారి పుత్రులు శ్రీ భాష్యం శ్రీనివాసాచార్యులు కూడా వారి వలెనే మంచి ఉపన్యాసాలు చేశా రు. వినే అవకాశం మాకు లభించింది. ఈ తిరుప్పావైకి మరో భక్తుడు అన్నమయ్య. గోద మ్మ రచించిన ఈ సిరినోము, శ్రీ వ్రతం, లక్ష ణాలను అన్నమయ్య కీర్తనలలో ఒకటో రెం డో ఎంచుకుని చదువరులకు అందిస్తున్నాం. 

కృష్ణుడు కార్ మేని అంటే మేఘం వలె దాచడానికి వీల్లేని శరీరం గలవాడు అని వివ రించారు గోదమ్మ. శ్రీ కృష్ణుని వెలుగు చల్లని ది. నారాయణ అనే శబ్ద ప్రయోగం చేసి గోదాదేవి మరెవరూ సాటిరాని నారాయణు డొక్కడే అని ఘంటాపథంగా ప్రకటిస్తున్నారు. ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీవేంకటేశుడు అన్న గీతాన్ని అన్నమయ్య ఇతడొక్కడే అని ముగిస్తాడు.  ‘నారాయణు డీతడు నరులార మీరు శరణనరో మిమ్ము గాచీని అనే పల్లవితో, తలచిన చోటను తానే ఉన్నాడు వలెనను వారి కైవసమెపుడు, కొల చెను మూడుడుగుల జగమెల్లాను కొలిచిన వారిని చేకొనకుండునా’ అని మొదటి చరణంలో వివరిస్తున్నారు.

మరోచోట ‘నీ నామమే మాకు నిధియు నిధానము’ అంటా డు అన్నమయ్య. నీ నామమే నాకు ... నిరం తరం భక్తులందరూ నారాయణుడుని స్మరిం చే కీర్తన. పరమ పదం చేరిన డాక్టర్ శ్రీభాష్యం శ్రీనివాస రామాచార్య దగ్గర ఉండి తన మార్గదర్శకత్వంలో అజ్ఞాత కళాకారుడు రూపొందించిన 30 కళాఖండాలను వారి కుటుంబం సౌజన్యంతో, వారి 30 పాశు రాలు ఒక్కొక్కటి ఇస్తున్నాం. 



-మాడభూషి శ్రీధర్