calender_icon.png 4 March, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్ల లెక్కింపు ఇలా..

03-03-2025 12:00:00 AM

చివరి ప్లేస్ నుంచి ఎలిమేషన్ ప్రక్రియ

కరీంనగర్, మార్చి ౨ (విజయక్రాంతి) : కరీంనగర్-మెదక్-నిజామాబాద్-అదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ సోమవారం నిర్వహించనున్నారు. కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ నిర్వహిం చేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలసత్పత్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 

బ్యాలెట్ పేపర్ విధానంలో పోలింగ్ నిర్వహించారు. ఉపాధ్యాయ ఎ మ్మెల్సీ ఫలితం సోమవారం సాయంత్రం వెలువడనుండగా, పట్టబద్రుల  ఎమ్మెల్సీ  ఫలితం  రెండు నుంచి మూ డు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు.

కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లుబాటయ్యే ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ముందుగా కోటాను నిర్దారించాల్సి ఉంటుం ది. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి, చెల్లుబాటయ్యే ఓట్ల లెక్క తేలుస్తారు. మొత్తం చెల్లబాటయ్యే ఓట్లలో 50 శాతం లెక్కకడతారు.

50 శాతానికంటే ఒక్క ఓటు ఎక్కువగా సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ముందు గా బ్యాలెట్ పేపర్లను కట్టలుకడతారు. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల కోసం ఒక్కొక్కరికి ఒక డబ్బా కేటాయించి వారు పొందిన ఓట్లను ఆ డబ్బాల్లో వేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కగడతారు.

ఉదాహరణకు మొత్తం 2 వేల ఓట్లు పోలైతే వాటిలో 1,800 ఓట్లు చెల్లుబాటైతే 901 ఓట్లు సాధించిన వ్యక్తి విజయం సాధిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థి 901 ఓట్ల కోటాను చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. 

ఎలిమినేషన్ ప్రక్రియ..

ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అందరికంటే తక్కువ ఓట్లు సాధించిన వ్యక్తికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. వాటిని పైనున్న అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఒక అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత కోటా ఓట్లు ఎవరికి రాకపోతే మరో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ... కోటా ఓట్లు వచ్చే వరకు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తారు.

ఎప్పుడైతే విజయానికి అవసరమైన కోటా ఓట్లు అభ్యర్థి సాధిస్తారో అప్పుడు అతడిని విజేతగా ప్రకటిస్తారు. పట్టభద్రుల ఓట్లు లక్షల్లో ఉండటంతో వాటి లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఉపాధ్యాయుల ఓట్లు కేవలం వేల సంఖ్యలో మాత్రమే ఉండటంతో ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తవుతుంది.