- హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు కొనసాగిన ఆందోళన
- గ్రూప్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్
ముషీరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): డీఎస్సీ, గ్రూప్ గ్రూప్ పరీక్షలు వాయిదా వేయబోమని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు మండిపడ్డారు. గ్రూప్ డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి నగరంలోని చిక్కడ్‌పల్లి లైబ్రరీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్ నుంచి అశోక్‌నగర్ జంక్షన్ వరకు వందలాది మంది నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. నిరుద్యోగుల ఆకస్మిక ధర్నాతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అశోక్ నగర్ జంక్షన్‌లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు, నిరుద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ నిరుద్యోగి సొమ్మసిల్లి పడిపోయారు. గ్రూప్ డీఎస్సీ పరీక్షల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నామని, ప్రిపరేషన్‌కు తగిన సమయమివ్వాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. డిసెంబర్ వరకు గ్రూప్ డీఎస్సీ, గ్రూప్ పరీక్షలను వాయిదా వేయాలని వేడుకున్నారు.