calender_icon.png 3 October, 2024 | 10:48 PM

బీహారీల గళం ఢిల్లీలో మార్మోగాలి

03-10-2024 12:28:57 AM

జన్‌సురాజ్ పార్టీ ప్రారంభించిన సందర్భంగా ప్రశాంత్ కిశోర్ పిలుపు

పాట్నా, అక్టోబర్ 2: రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిశోర్ బీహార్‌లో తన కొత్త పార్టీ జన్ సురాజ్‌ను అధికారికంగా ప్రారంభించారు. బుధవారం పాట్నాలో ప్రముఖుల సమక్షంలో తన రాజకీయ పార్టీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశ్రాంత ఐఎఫ్‌ఎస్ అధికారి మనోజ్ భారతి ఈ పార్టీకి నేతృత్వం వహిస్తారని తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లోని అన్ని స్థానాల్లో పార్టీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రారంభం సందర్భంగా జై బీహార్ అని గట్టిగా నినదించాలని భారీగా ప్రజలను ప్రశాంత్ కోరారు. జై బీహార్ అని గట్టిగా నినదించాలి. అప్పుడే మీ పిల్లలను ఎవరూ బీహారీ అని పిలువరు. అలా చులకనగా చూడరు. మీ గొంతు ఢిల్లీకి వినబడాలి.

బీహార్ విద్యార్థులను కొట్టిన బెంగాల్‌కూ చేరాలి. బీహార్ పిల్లలను హింసించిన తమిళనాడు, ఢిల్లీ, ముంబై సహా ఎక్కడైనా ఈ గళం మార్మోగాలి పిలుపునిచ్చారు. 25 ఏళ్లు లాలూప్రసాద్ లేని కారణంగా బీహార్ ప్రజలు భయపడి బీజేపీకి ఓటు వేస్తున్నార ని, ఈ రాజకీయ నిస్సహాయతను అంతం చేయడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు.