25-04-2025 02:04:38 AM
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): తమ పదేండ్ల పాలనలో మురిసిన పల్లెలు.. నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ కన్నీరు పెడుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నర గడిచినా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవని, 15వ ఆర్థిక సంఘం నిధులు లేవని లేవని పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
బీఆర్‌ఎస్ పాలనలో పల్లెప్రగతికి ప్రాణం పోశామని, సమైక్య పాలనలో దశాబ్దాల పాటు దగాపడిన పల్లెలను దర్జాగా కాలర్ ఎగరేసుకొనే స్థాయికి తీర్చిదిద్దామని చెప్పారు. ప్రతీ పల్లె లో డంప్‌యార్డ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఖాళీ ఇండ్ల కిరికిరి నుంచి, పొంగిపొర్లే మురికికాలువల శుభ్రత వరకూ ప్రతీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని కేటీఆర్ అన్నారు.
పచ్చద నానికి కొదవ లేకుండా, నిధులకు కొరత లేకుండా, విధులకు ఆటంకం లేకుండా ప్రతి ఊరిని మెరుగైన జీవనానికి మారుపేరుగా మార్చింది కేసీఆర్ విజన్ అని చెప్పారు. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ, పల్లెప్రగతిలో 30 శాతం అవార్డు లు గెలుచుకుందని, ఇది పల్లెప్రగతిలో భాగస్వాములైన ప్రతిఒక్కరి విజయంగా తెలి పారు. నేడు కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో కనీస వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశా రు.
పల్లె ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు దిక్కులేవని వాపోయారు.దేశంలోనే ఆదర్శ గ్రామా లకు చిరునామాగా నిలిచిన తెలంగాణ పల్లెలు, నేడు అధ్వాన పరిస్థితులకు అడ్రస్‌గా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉండి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీకి, పచ్చని పల్లెలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్‌లకు తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాతపెడతారని కేటీఆర్ వాపోయారు.