31-03-2025 11:37:56 PM
పోలీస్ స్టేషన్ తనిఖీలో ఎస్పీ అఖిల్ మహాజన్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ విలేజ్ పోలీస్ వ్యవస్థను పున: ప్రారంభించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జైనథ్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని రికార్డులను తనిఖీ చేసి, పరిసరాలను పరిశీలించి, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఈమేరకు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.... పోలీస్ స్టేషన్ లలో రికార్డుల నిర్వహణ, నవీకరణ ప్రతిరోజు సరైన సమయంలో నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు. ప్రతి గ్రామానికి విలేజ్ పోలీస్ ఆఫీసర్ కేటాయించి పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను విలేజ్ పోలీస్ ఆఫీసర్ ద్వారా పరిష్కరించే దిశగా వ్యవస్థను నిర్మించాలని తెలిపారు.
పోలీసు మీకోసం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నా ధైర్యంగా తెలపాలని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మండలంలో ఉన్న రౌడీ లపై సరైన రౌడీ షీట్లు ఏర్పాటుచేసి ప్రతిరోజు పర్యవేక్షించాలి అని తెలిపారు. గంజాయి పూర్తిగా నిర్మూలించే వరకు సమాచార వ్యవస్థను మరింత పటిష్టంగా మెరుగుపరచుకొని మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలని తెలిపారు. బ్లూ కోర్ట్, 100 డైల్ ప్రతిరోజు పెట్రోలింగ్ గస్తీ నిర్వహిస్తూ ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలైన నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి జీవన్ రెడ్డి, జైనథ్ సిఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.