calender_icon.png 19 April, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సింహాల స్వైర విహారం

05-04-2025 01:13:29 AM

ఒకే రోజు ముగ్గురిపై దాడి చేసిన వీధి కుక్కలు

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 4 (విజయ క్రాంతి) వీధి కుక్కలు ప్రజలను తీవ్ర భయ బ్రాంతులకు గురిచేస్తున్నా యి. ఆ గ్రామం , ఈ గ్రామం అనే తేడా లేకుండా గుంపు లు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు , సైకిల్, ద్విచక్రవాహనదారులను వెంబడించి పరుగుపెట్టిస్తున్నాయి. వీధికుక్కల స్త్వ్రర విహారంతో గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

ఒకేరోజు ముగ్గురిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు రాత్రివేళల్లో రోడ్లపైకి గుంపులు గుంపులుగా వచ్చి రోడ్లపై నుంచి వెళ్ళే వారిపై దాడులు చేస్తుండడంతో కుక్కలు కనబడితే చాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్టు గౌడవెల్లి గ్రామ ప్రజలు వాపోయారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని వీధి కుక్కల బెడద నుంచి గ్రామస్తులను కాపాడాలని కోరారు