- మెదక్ జిల్లాలో రెచ్చిపోతున్న శునకాలు
- పెరుగుతున్న కుక్కకాటు బాధితులు
- పిల్లలను బయటకు పంపించాలంటేనే జంకుతున్న పేరెంట్స్
- పట్టించుకోని మున్సిపల్ అధికారులు
మెదక్, డిసెంబర్ 2౮(విజయక్రాంతి): మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధులు, ప్రధాన రహదారుల్లో గుంపులుగా సంచరిస్తూ కనిపించిన వారిపై దాడులకు ఎగబడుతున్నాయి. రోజూ ఏదో ఒక కుక్క దాడి ఘటన చోటు చేసుకుంటూనే ఉంది.
రాత్రివేళల్లో ఇండ్ల నుంచి బయటకు రావాలంటనే ప్రజలు జంకుతున్నారు. చిన్నారులను ఒంటరిగా పాఠశా బయటకు పంపేందుకు తల్లిదండ్రులు వెనకాడుతున్నారు.
కనిపించని నియంత్రణ చర్యలు..
జిల్లాలో కుక్కల నియంత్రణకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితి ఆందోళనక మారుతోంది. కుక్కల నియంత్రణపై ఒక్కో మున్సిపాలిటీలో భిన్న వాదనలు వినిపిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి వీధి కుక్కకు పిల్లలు కలగకుండా శస్త్రచికిత్స చేయాలి. కానీ కొన్ని మున్సిపాలిటీలు ఇతర ప్రాంతాల్లో వదిలిపెట్టామని చెబుతున్నా అందుకు సంబంధించిన చిత్రాలేవీ పురపాలిక యంత్రాంగం వద్ద అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ఊసేలేని కమిటీ పర్యవేక్షణ..
ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు మున్సిపాలిటీ సిబ్బంది ప్రత్యేక టీంతో సంబంధిత ప్రాంతానికి వెళ్లి శునకాలను పడతారు. వాటికి ఏబీసీ శస్త్ర చికిత్స నిర్వహించడంతో పాటు ర్యాబిస్ సూదిమందు ఇచ్చి.. మూడు రోజుల అనంతరం మళ్లీ అదే ప్రాంతంలో వదులుతారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం మున్సిపల్ కమిషనర్, స్వచ్ఛంద సంస్థలు, పశువైద్యులతో కూడిన కమిటీ పర్యవేక్షణలో జరగాలి.
అయితే ఏ రోజుకారోజు ఎన్ని కుక్కలకు శస్త్ర చికిత్సలు జరిగాయి..తొలగించిన అవయవాలను నిర్వీర్యం చేశారా లేదా అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. తద్వారా నకిలీ బిల్లులకు ఆస్కారం ఉండదు. కానీ మున్సిపాలిటీల్లో కమిటీల పర్యవేక్షణ ఊసే లేకుండా పోయింది. కుక్కల నియంత్రణకు ఖర్చు చేసిన నిధుల వివరాలను సైతం వెల్లడించేందుకు అధికారులు వెనకాడు
ప్రతినెలా పెరుగుతున్న బాధితులు..
జిల్లా వ్యాప్తంగా కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రతినెలా సగటున సుమారు 200 మందికి పైగా కుక్కకాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ 27 వరకు సుమారుగా 1500 మంది జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందారు.
దీన్నిబట్టి కుక్కల వీరంగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ సంబంధిత అధికారులు కుక్కల నియంత్రణపై దృష్టి సారించడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలక స్పందించి వీధి కుక్కల బెడద తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.