23-04-2025 12:43:41 AM
-ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన కళాశాల కరస్పాండెంట్ వెంకటరెడ్డి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో కొలువుతీరిన వాగ్దేవి కళాశాల ఇంటర్ ఫలితాలలో విజయ తీరాలకు చేరుతూ ప్రభంజనం సృష్టించింది. ఇంటర్ ఫలితాలలో తమకు మరి ఎవరు సాటి లేరనే సాంకేతాను పంపిస్తూ అరుదైన రికార్డులను వాగ్దేవి కళాశాల సొంతం చేసుకుంది. వెలువడిన ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర ఫలితాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ భాగంలో అమీనా 468 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించారు.
అక్షయ శ్రీ 466 మార్కులు అమృత వర్షిని, వైశాలి 465 మార్కులు సొంతం చేసుకున్నారు. మొదటి సంవత్సరం బైపిసి విభాగంలో సంజన 436 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంక్ రాబట్టారు. ఫరీహ, పాయల్ సింగ్, మదియా435 మార్కులు సాధించారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ భాగంలో నవనీత్ గౌడ్ 992 మార్కులు, బైపిసి విభాగంలో రబ్ ష 991 మార్కులు, సఫూరా 989 మార్కులతో అత్యుత్తమ ర్యాంకులను తమ సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఇంతటి ఘనవిజయాన్ని సాధించడానికి అధ్యాపకులు అందరూ కూడా ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్ తో నాణ్యమైన బోధన అందించి విజయం సాధించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గీతాదేవి అకాడమీ ఇంచార్జ్ పావని రెడ్డి, యాజమాన్య సభ్యులు కోట్ల శివకుమార్ ,రాఘవేంద్రరావు, నాగేందర్, సతీష్ రెడ్డి ,బాబుల్ రెడ్డి ,రఘువరన్ రెడ్డి వైస్ ప్రిన్సిపాల్ జ్యోతినందన్ రెడ్డి ఎంసెట్ ఇంచార్జ్ షాకీర్ ఎగ్జామినేషన్ ఇంచార్జ్ చెన్నయ్య,యాకూబ్ ,హుస్సేన్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.