calender_icon.png 15 November, 2024 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా అఘాడి కూటమి విజయం తథ్యం

15-11-2024 02:18:45 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్14 (విజయక్రాంతి): మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహా అఘాడి కూటమి విజయం తథ్యమని తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాందేడ్ ప్రాంతంలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీతో కలిసి వివిధ సభల్లో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు న్యాయం జరగాలంటే మహా అఘాడి కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తుందని వివరించారు. మహారాష్ట్రలో మహా అఘాడి కూటమి గెలుపు దిశగా సంకేతాలు కన్పిస్తున్నాయని ధీమా వ్యక్తంచేశారు. ప్రచారంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.