సిబ్బందికి సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి
మంథని పోలీస్ స్టేషన్ తనిఖీలో రామగుండం సిపి శ్రీనివాస్...
మంథని (విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు నమ్మకం, భరోసా కల్పించాలని రామగుండం కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. వార్షిక తనీఖీల్లో భాగంగా మంథని పోలీస్ స్టేషన్ సీపీ సోమవారం తనీఖీ చేసారు. తనీఖీలో భాగంగా స్టేషన్ కు చేరుకున్న సీపీకీ పోలీస్ అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలకగా, సాయుధ పోలీసులు గౌరవ వందనం చేసారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ లోపల రైటర్ రూమ్, లాక్ అప్ రూమ్లను సీపీ పరిశీలించారు. ఫిర్యాదులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, కోర్ట్ లో పెండింగ్ లో వున్న కేసులు, వాటికి సంబందించిన దర్యాప్తు వివరాలను, రోడ్డు ప్రమాదాల నివారణకు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు సమస్యత్మక గ్రామాల వివరాలు, ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీటర్స్ వివరాలు సబ్ ఇన్స్ స్పెక్టరును అడిగి తెలుసుకున్నారు.
చిన్నచిన్న కారణాలతో పోలీసు సిబ్బంది ఆత్మహత్యల ఘటనలకు పాల్పడం చేస్తున్నారని, అవేదన వ్యక్తం చేశారు. అధికారుల, సిబ్బంది యొక్క బాగోగులు, సంక్షేమం ఉన్నత అధికారులుగా బాధ్యత అని కావున ఏదైనా సమస్య ఉంటే అధికారులకు తెలిపారన్నారు. గ్రామాల్లో నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖిల్లో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్. గోదావరిఖని ఎసిపి రమేష్, మంథని సీఐ బి. రాజు, ఎస్ఐ రమేష్ సిబ్బంది ఉన్నారు.