11-04-2025 12:39:15 AM
లక్నో, ఏప్రిల్ 10: పీజీ విద్యార్థిని రేప్ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అత్యాచారానికి బాధితురాలే కారణమని, సమస్యను ఆమే ఆహ్వాని ంచిందని పేర్కొంది. బాధితురాలి చర్యలను తప్పుబడుతూ నిందితుడికి బెయిల్ మం జూరు చేసింది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నోయిడాలోని ఓ యూనిర్సిటీలో పీజీ చేస్తున్న యువతి గత ఏడాది సెప్టెంబర్‌లో తన స్నేహితురాళ్లతో కలిసి ఢిల్లీలోని హౌస్ ఖాన్‌లో ఉన్న బార్‌కు వెళ్లింది.
ఆ సమయంలో ఆమె నిందితుడు సహా మరికొంద రితో పరిచయస్తులతో కలిసి, తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం సేవిం చింది. ఆ తర్వాత నిందితుడు బలవంతం చేయడంతో విశ్రాంతి కోసం అతడి ఇంటికి వెళ్లేందుకు అంగీకరించింది. అయితే, నిందితుడు ఆ యువతిని అతడి ఇంటికి కాకుండా బంధువుల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు గత డిసెంబర్‌లో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై గురువారం విచారణ జరిపిన అలహాబాదు హైకోర్టు అత్యాచారానికి బాధితురాలే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘బాధితురాలి ఆరోపణ నిజమని అంగీకరించినప్పటికీ ఆమె స్వయంగా సమస్యను ఆహ్వానించింది’ అని విచారణ సంద ర్భంగా జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
యువతి పీజీ చదువుతున్నందున ఆమె చేసే పనులపట్ల పరిణితి ఉందని భావిస్తున్నట్టు కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో నిందితుడికి బెయిలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. కాగా, కొద్దిరోజుల క్రితం ఇదే హైకోర్టు స్త్రీల వక్షోజాలను పట్టుకోవడం వం టివి అత్యాచారయత్నం కిందకు రాదంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.