calender_icon.png 20 January, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ వైదిక బృందం

20-01-2025 06:30:41 PM

బైంసా (విజయక్రాంతి): వచ్చే నెల ఒకటో తేదీ నుండి మూడో తేదీ వరకు జరిగే వసంత పంచమి ఉత్సవాలకు ఆలయ వైదిక బృందం సోమవారం రోజున ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్(MLA Power Rama Rao Patelb) కు ఆహ్వాన పత్రికను అందజేస్తూ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భక్తులకు ఎలాంటి సంఘటన జరగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ(Minister Konda Surekha) ఇదివరకే ఆహ్వాన పత్రికను అందజేశామని మంత్రి వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రత ఏర్పాట్లతో పాటు భక్తులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నవీన్ కుమార్, పిఆర్ఓ నారాయణ పటేల్, ఉప ప్రధాన అర్చకులు శ్రీపాదరావు, ప్రధాన అర్చకులు సంజు పూజారి తదితరులు పాల్గొన్నారు.