కామారెడ్డి, జనవరి 31 (విజయక్రాంతి): వడ్డెరల సమస్యలు పరికావాలంటే ఉద్యమాలకు సిద్ధం కావాలని వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈడగొట్టి సాయిలు అన్నారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయనికా వడ్డెర వృత్తిదారుల సంక్షేమంకో ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదన్నారు. గ్రామాల్లో పనులు కోల్పో పట్టణాలకు వలసలు వెళ్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డెర వృత్తిదారుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలనిడి చేశారు.
కంకర క్వారీలను సొసైటీలకే ఇవ్వాలని బ్యాంకులు ఎలాంటి షరతులు లేకుండా మిషన్లు కొనడానికి రుణాలు సబ్సిడి రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ వెంకట్‌గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తిదారుల సంక్షేమం కోసం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు.
చేతివృత్తిదారులను సం జిల్లా కాల్యెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపా బాలయ్య, జిల్లా అధ్యక్షుడు నర్సింలు, జిల్లా కార్యదర్శి రాజు, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు రాజన్న, రాములు, స్వామి, రాజేందర్, మల్లయ్య, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.