calender_icon.png 8 October, 2024 | 10:09 AM

ఈ ఆసనం ఉపయోగం..

08-10-2024 12:00:00 AM

యోగా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే యోగా లో ఏ ఆసనం వేసినా చివరకు శవాసనం వేయాలి. శవాసనం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

* శాంతి ఆసనం, అమృతాసనం, శవాసనం ఇలా ఏ పేరుతో పిలిచినా ఒకటే. కొన్ని శతాబ్దాలుగా మెదడులోని శక్తిని ఉత్తేజితం చేసేందుకు ఉపయోగిస్తున్న ఆసనమే శవాసనం. 

* శవాసనం ప్రధానంగా ఇది మెదడుపై ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతనిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. 

* శవాసనాన్ని వేసే ముందు పేరుకు తగ్గట్టుగానే శవంలాగే ముందు వెల్లకిలా పడుకోవాలి. మోచేతులను, కాళ్లను చాపి ఉంచి కళ్లు మూసుకుని ప్రశాంతంగా గాలి పీల్చుకోవాలి. 

* శవాసనాన్ని యోగా ప్రక్రియ ముగించే సమయంలో వేయాలి. యోగాసనాల్లో దీనికి అత్యున్నత ప్రాముఖ్యం ఉంది.

* శవాసనంలో శరీరంలో కదలికలను నియంత్రిస్తూ శవం మాదిరిగా నిశ్చలంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. దీని ఫలితంగా శ్వాస మీదనే ధ్యాస ఉంచడం సాధ్యమవుతుంది. 

* శవాసనాన్ని రెగ్యులర్‌గా వేస్తుండటం వల్ల మెదడు నిర్మాణంలో మార్పులు కలుగుతాయి. కొత్త కొత్త విషయాలను నేర్చుకునేందుకు కావాల్సిన ఏకాగ్రతతో పాటు, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

* భావోద్వేగ నియంత్రణతో సంబంధం ఉన్న మెదడులోని ప్రాంతాలలో గ్రే మ్యాటర్ పెంచుకునేందుకు సహాయపడుతుంది.