తిరుమలగిరి (విజయక్రాంతి): తెలంగాణలోని పేద ప్రజల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో మంగళవారం హనుమకొండ జిల్లా ఆర్ట్స్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇందిరా మహిళ శక్తి విజయోత్సవ సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేయుచున్న సందర్బంగా మహిళలు సభకు వెళుతున్న తరుణంలో బస్సులకు జెండా ఊపి వారి ప్రయాణాన్ని ప్రారంభింపజేశారు.
అనంతరం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ పరిపాలనలో పేద ప్రజలందరికీ బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. పేద ప్రజలకు ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ కాలంలోనే ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పేద ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ చాగంటి అనసూయ రాములు, మండల అధ్యక్షుడు ఎల్సోజు నరేష్, పిఎసిహెచ్ చైర్మన్ పాలపు చంద్రశేఖర్, కందుకూరు లక్ష్మయ్య తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.