calender_icon.png 26 March, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణాది రాష్ట్రాల ఐక్యత శుభపరిణామం

24-03-2025 12:33:13 AM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కే కేశవరావు 

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావడం శుభపరిణామని రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కే కేశవరావు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం చేపట్టనున్న లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకం గా సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణ యం అభినందనీయని కొనియడారు.

డీలిమిటేషన్ 30 ఏళ్లకోసారి చేయాల ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ భావించారని, ఆ నిర్ణయం కేవలం సీట్ల కోసం కొట్లాట కాదని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్టమని, అక్కడ ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయని తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంట్‌లో దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

డీలిమిటేషన్‌ను అడ్డుకునేందుకు ఇటీవల తమిళనాడులో అక్కడి సీఎం స్టాలిన్ నిర్వహించిన అఖిల పక్ష సమావేశం అత్యంత కీలకమైందని అభివర్ణించారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిందేనన్నారు. ఆ సమావేశాన్ని కించ పరిచే విధంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.

దక్షిణాది రాష్ట్రాలో జనాభా తక్కువగా ఉందని, డీలిమిటేషన్ కారణంగా ఆయా రాష్ట్రాలు నష్ట పోతాయని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు 10 లక్షల జనాభాకు ఒక ప్రతినిధి ఉండాలనుకుంటే, దేశవ్యాప్తంగా 1,875 సీట్లు అవసరం అవు తుందన్నారు.

డీలిమిటేషన్ ద్వారా యూపీలో ఎంపీ సీట్ల సంఖ్య 80కు మరో 14 సీట్లు, తెలంగాణలో రెండు సీట్లు, ఏపీలో ఐదు సీట్లు పెరుగుతాయన్నారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకం గా సీఎం నిర్ణయం తీసుకోవడం, అవసరమైతే హైదరాబాద్‌నూ అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామని వెల్లడించారు.