13-03-2025 01:10:00 AM
68ఏండ్ల సుదీర్ఘ చరిత్ర గల యూనియన్ గ్రామీణ విలేకరులకు
అక్రిడేషన్ కల్పించిన ఘనత టీయూడబ్ల్యూజేదే
టీయూడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్
మహబూబ్నగర్ మార్చి 12: ఐక్యతగా ఉండి.. మన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ముందుకు సాగాలని టియుడబ్ల్యూజే (ఐజెయు)రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వాసవి విద్యార్థి వసతిగృహంలో ఏర్పాటు చేసిన యూనియన్జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో ప్రస్తుత యూనియన్ జిల్లా కమిటీని రద్దు చేశారు. ఈ సందర్భంగా మధు గౌడ్ మాట్లాడుతూ మనందరం ఐక్యత తో ఉండి పోరాటం చేస్తే మన సమస్యల పరిష్కారం సాధించుకుంటామన్నారు. టి యు డబ్ల్యూ జే యూనియన్ పోరాటం మూలంగా అక్క్రిడిటేషన్ వచ్చాయని గుర్తు చేశారు.
యాజమాన్యం గ్రామీణ ప్రాంత విలేకరులను గుర్తించకుండా ఉంటే మన యూనియన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం లో సూర్యాపేటలో ఆనాటి సీఎం బాబు దృష్టి కి తీసుకెళ్లి వర్కింగ్ జర్నలిస్ట్ లుగా గుర్తింపు తెచ్చుకున్నామని గుర్తు చేశారు. తమది ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాసే యూనియిన్ కాదని, మనది, విలువలతో ఉంటూ ఎన్నో త్యాగాలు చేసిన యూనియిన్ అన్నారు. 68 సంవత్సరాల క్రితం ఆవిర్బవించిన యూనియిన్ నేటికీ జర్నలిస్ట్ ల సంక్షేమ కోసం పోరాటం చేస్తున్నదని పేర్కొన్నారు.
జర్నలిస్ట్ ల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక యూనియిన్ ఐజేయు అని తెలిపారు. పవిత్ర మైన జర్నలిజన్ని అపవిత్రం చేయడానికి సమాజంలో కొందరు పని కట్టుకుని రోజూ వ్యక్తి గతంగా టార్గెట్ చేస్తూ న్యూస్ రాయడం, తమ మనుగడ కోసం ఈ వృత్తి ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి దుష్టశక్తులకు తమ యూనియన్ వ్యతిరేకమన్నారు. ఈ క్రమంలో జర్నలిస్ట్ రంగాన్ని, రంగంలో విలువలను కాపాడడానికి మన నాయకుడు కరెక్ట్ పర్సన్ అని ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి ని నియమించడం జరిగిందన్నారు.
రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ నాయకత్వం లో పని చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నామన్నారు. యూనియన్ లో క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని వీలైనంత త్వరితగతిన సభ్యత్వాల నమోదు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సభ్యులందరి ఆమోదంతో ప్రస్తుత జిల్లా కార్యవర్గాన్ని రద్దు చేస్తూ, 9 మంది సభ్యులతో అఢ్ హక్ కమిటీని ప్రకటించారు.అఢ్ హక్ కమిటీ సభ్యులుగా శేఖర్ గౌడ్, విజయ రాజు, బిజీ రామాంజనేయులు, కె వెంకట్, సతీష్ రెడ్డి, ముజీబ్, పేట వెంకటయ్య, గోకులం వెంకటేష్, నరేందర్ ను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అటాక్స్ కమిటీ సభ్యుడు అహ్మద్ పాషా, యూనియన్ జిల్లా నాయకులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.