calender_icon.png 4 February, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరి నశించాలి

04-02-2025 12:00:00 AM

డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి 

సిద్దిపేట, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరి నశించాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి విమర్శించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ర్యాలీ నిర్వహించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా ఇచ్చిందని విమర్శించారు తెలంగాణ రాష్ర్టంలోని బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు వెంటనే పదవులకు రాజీనామా చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు హరికృష్ణ, జి శ్రీనివాస్, బొమ్మల యాదగిరి, మార్గ సతీష్, అతు ఇమామ్, గయాస్, మంజుల రెడ్డి, లక్ష్మి, వనజ, ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.