ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
హైదరాబాద్, జూలై 15 ( విజయక్రాంతి): ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని కాం గ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ప్రకటించిన పరీక్షలను వాయిదా వేయ మనడం సమంజసం కాదన్నారు. కొందరు రాజకీయ నాయకులు విద్యార్థుల ముసుగులో కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారని ఆరోపించా రు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఉద్యోగాలను భర్తీ చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ట అడుగంటి పోయేలా చేసింది కేసీఆర్ కాదా అని చిన్నారెడ్డి ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పదేళ్లపాటు అణిచివేత ధోరణి అవలంభిం చిన బీఆర్‌ఎస్ నేతలు.. ప్రతిపక్షంలో ఉన్నప్పడు నీతులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగులు ప్రతిపక్ష పార్టీల చేతిలో బంతిలాగా మారవద్దన్నారు. కష్టపడి చదివి ఉద్యాగాలు సా ధించి తల్లిదండ్రులకు ఆర్థకంగా అండగా ఉండటంతో పాటు ప్రజాసేవ చేసిప్పుడే అమరుల త్యాగాలకు నిజమైన నివాళి అర్పించినవారవుతారన్నారు.