21-04-2025 12:00:00 AM
ఎల్రెడ్ కుమార్ నేతృత్వంలోని నిర్మాణ సంస్థ ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై ‘మందాడి’ అనే చిత్రం రానుంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో సూరి ప్రధాన పాత్రలో నటించారు. మతిమారన్ పుగళేంది రచనాదర్శకత్వంలో, మానవ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో తెలుగు నటుడు సుహాస్‌ను తమిళ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. రామనాథపురం, ట్యూటికోరిన్ తీరప్రాంతాల్లో మందాడి అంటే నాయకత్వం వహించే అనుభవజ్ఞుడైన నిపుణుడు అని అర్థం.
సముద్ర ప్రవాహాలు, గాలి దిశలు, అలల నమూనాల గురించి అసాధారణమైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తిని మందాడి అని పిలుస్తారట. చేపల కదలికలను అంచనా వేయడంలో, ప్రమాదకరమైన అలలను నావిగేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ నైపుణ్యాలే అతన్ని పడవ పందెంలో తిరుగులేని నాయకుడిగా చేస్తాయి.