calender_icon.png 19 April, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసించని రాజీవ్ యువ వికాసం!

29-03-2025 12:00:00 AM

  • అడ్డంకిగా మారిన  రేషన్‌కార్డు అర్హత 
  • ఆదాయ కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయడం

కొత్తగూడెం, మార్చి 28 (విజయక్రాంతి ) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం లో రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఆంక్ష విధించడం అడ్డంకుగా మారింది.జిల్లాలోని నిరుద్యోగ యువ తి యువకులు రాజీవ్ యువ వికాసం కు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. స్వయం ఉపాధిని పెంపొందించుకునే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకం రూపొం దించింది.

ఈ పథకానికి అర్హులను ఎలా ఎంపిక చేస్తుందో అర్థం కాని స్థితిలో, యువ త నిరుద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు .ప్రభుత్వం తీరు అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు మాత్రమే అనే ప్రచారం కూడా లేకపోలేదు. నిజానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి వ్బుసైట్లో దరఖాస్తు చేసు కుంటున్న క్రమంలో ముందుగా ఆధార్ నంబర్ అప్లోడ్ చేస్తే, తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ని కూడా కచ్చితంగా ఎంట్రీ చేయగానే మీ కుటుంబంలో గత ప్రభుత్వ పాలనలో ఎవరైనా ఒక్కరు లబ్ధి పొందినా ఆ కుటుంబం మొత్తం అనర్హతకు గురవుతుంది.

ఇందులో బాధాకరమైన విషయం ఏమిటి అంటే గత ప్రభుత్వం పలు రకాల రుణలకు అప్లై చేసుకున్న వారు అనర్హులు. నేడు రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తుండగానే, ఈ నోటిఫికేషన్ రావటం ,రేషన్ కార్డుల నుండి పేర్లు తొలగించిన కూడా గత ప్రభుత్వంలో లోను పొందినట్లు గా చూపడం విచారకరం అని యువత వాపోతోంది. ఒక కుటుంబంలో ఒకరికి ఒక్కసారే అనే నిబంధన యువతను కబళించి వేస్తోంది. ఈ యొక్క పథకాలు యువతకు అందని ఫలాలుగానే మిగిలిపోనున్నాయి యువ వికాసం కాస్త వికసించని,పరిమళించని పుష్పంలా మిగిలేలా ఉంది.

 నిరుద్యోగ యువతీ యువకులు కారణం, రేషన్ కార్డులు ఇవ్వకుండా లోన్ కు అప్లై చేసుకోండి అని చెప్పడం ఎంతటి దుర్మార్గమైన చర్య అనే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒకవైపు అందని రేషన్ కార్డులు తో దరఖాస్తు చేయటమే ప్రశ్నార్థం కంగా మారితే,మరోవైపు రాజకీయ నాయకులు చోటమోటా లీడర్లు,రాజీవ్ యువ వికాసం లోన్లు మేము ఇప్పిస్తాం అని అనటం, కొంత ఖర్చు అవుతుంది, అనే గల్లీ లీడర్లు పైరవీలు ప్రారంభం కావడం కోసమెరుపు.