calender_icon.png 6 January, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నడిగడ్డ దోపిడీ దొంగలు ఒక్కటయ్యారు

10-07-2024 05:36:12 AM

  • పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కృషి: ఎంపీ డీకే అరుణ 

గద్వాల (వనపర్తి), జూలై 9 (విజయక్రాంతి): ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సరిత, ఎన్నికల తరువాత చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నడిగడ్డను దోచుకోవడానికి ఒక్కటయ్యారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రలో ఏర్పాటుచేసిన అభినందన సభలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఆదరాబాదరగా గద్వాల జిల్లాకు మెడికల్ కళాశాల అనుమతి జీవోలు తెచ్చారని, ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్ పాటించలేదని అన్నారు. దీంతో అనుమతులు రద్దయ్యాయని చెప్పారు.  ఎన్‌ఎంసీ చెప్పిన అన్ని వసతులను కల్పించి మెడికల్ కళాశాల అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ఎమ్మెల్యే పని చేయాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సరితను ఓడగొట్టిందెవరో ప్రజలకు తెలుసునని అన్నారు. నెట్టెంపాడు, గట్టు, జూరాల ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.