calender_icon.png 25 December, 2024 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవుల్లో నిజాలు ఖనిజాలు!

25-08-2024 12:00:00 AM

మాడభూషి శ్రీధర్ :

షెడ్యూల్డ్ ప్రాంతాలలో మొత్తం 11.3 శాతం భారత దేశపు భూమిలో జనాలు ఉన్నారు. ఎస్టీ వారికి 8.6 శాతం జనాభా ఉంది. అయిదో షెడ్యూల్‌లో 10 రాష్ట్రాలు ఉన్నాయి. ఆరో షెడ్యూల్‌లో 4 రాష్ట్రాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 244 కింద విభిన్నమైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొత్తం అధికారం 59 శాతం జనాభా వారికి ఏజెన్సీ పేరుతో గవర్నర్‌కు దత్తమై ఉంటాయి. 244(1) కింద 5వ షెడ్యూల్ 244 (2) కింద ఆరోషెడ్యూల్ అధికారాలు వర్తిస్తాయి. వారికి పంచాయతీల షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణ చట్టం - ‘పెసా’ అనే 1996 నాటి చట్టం వర్తిస్తుంది. 2006 నుంచి ఎఫ్ ఆర్ ఏ ఫారెస్ట్ హక్కుల చట్టం వర్తిస్తున్నది.

అక్కడ రెవెన్యూ చట్టాలు సవరించి పాత సంప్రదాయాలకు సంబంధిం చిన నియమాలు అమలు చేస్తారు. రాజ్యాంగం 5వ షెడ్యూల్ కింద పది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ర్ట, హిమాచల్ ప్రదేశ్ వస్తాయి. 6వ షెడ్యూల్‌లో నాలుగు రాష్ట్రాలు   అస్సాం, మేఘాలయా, త్రిపుర, మిజోరం ఉన్నాయి. కేరళలో 5 జిల్లాల్లోని 2 వార్డులు, 2133 నివాసాలలో, అయిదు గ్రామ పంచాయితీలు కూడా షెడ్యూల్డ్ ప్రాంతంలోకి చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సగం జనాభా ఆదివాసీలే

1951 జనాభా లెక్కల ప్రకారం 40 శా తం మంది గిరిజన లేదా ఆదివాసులు ఉన్నారని అంచనా. ఇప్పటి జనాభా లెక్క లు కచ్చితంగా చేస్తే కనీసం 50 శాతం ఈ జనాభా మనదేశానికి విస్తరించిందని అ ర్థం అవుతుంది. అంటే మొత్తం భారతరాజ్యాంగం కింద సగం జనాభా రెండు షె డ్యూల్డ్ జనం కింద ప్రత్యేక పరిపాలనా విధానాలు ఉన్నాయి. 

మిగతా సగం జనాభాకు మనకు తెలిసిన దేశానికి ఉన్న పరిపాలన అది కాక, మరో సగం జనాభా వేరే రాజ్యాంగ పాల నా పరిపాలన ఉంటుందన్నమాట. కనుక ఆదివాసులు, గిరిజన, హరిజన అనే పేరుతో సగం జనాభా మన దేశంలో ఉ న్నారని అర్థం చేసుకోవాలి. అప్పుడు వారి కష్టాలు, లాభాలు తెలుస్తాయి. వారికి ట్రైబ ల్ సలహామండలి ఉంటుంది. గవర్నర్ స లహాదారుడుగా ఉంటారు. అంటే రాజ్యాంగ ప్రజాస్వామ్య విధానం అమలులో ఉంటుందని మనందరికీ తెలుసు.  

ప్రత్యేక లెక్కల ప్రకారం మరో సగం జ నాభాకు గవర్నర్ గారు, వారి ద్వారా అధికారం ముఖ్యమంత్రికి వస్తుంది. అంటే పా ర్లమెంటు లేదా ఆయా అసెంబ్లీలలో అధికారాలు ఉండవు.కేవలం గవర్నర్ కు మాత్రమే వస్తుంది. దాని అర్థం ఏమంటే మొత్తం అధికారాలు పోలీసులకు, సైన్యానికి, లేదా ఇతర రకాల సాయుధ అధికారులకు ఉంటాయి. 

ఎన్‌కౌంటర్ల హాహాకారాలు

ఛత్తీస్‌గఢ్‌లో అటు సాయుధ దళాల తుపాకుల ధ్వనుల మధ్య ఇటు ఆదివాసు లు తీవ్రమైన ఘర్షణలో కొట్టుమిట్టాడిపోతున్నాయి. అక్కడ ఎన్ కౌంటర్ల హాహాకా రాలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ తొలి ట్రై బల్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ నా యకత్వంలో 2023 డిసెంబర్‌లో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్నది. ఆదివాసుల హక్కులు అడుగుతున్నారు. అదే సమస్య. అది రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాల అధికారానికి సంబంధించిన సమస్యగా మారింది. ఆ ప్ర భుత్వాల కింద సాయుధ దళాలకు, మ రోవైపు ఆదివాసుల హక్కుల పోరాటాలకు మధ్య ఘర్షణగా మారింది. అక్కడ ‘ఆపరేషన్ ప్రహార్’ పేరుతో యుద్ధాన్ని కొనసాగి స్తున్నారు.  దీని పేరు ఎన్ కౌంటర్లు. కాదు కాదు, ద్రోణ్ సాంకేతిక తెలివితేటలు వాడుకుంటూ దానికి బాంబులు అమర్చి, జనం మీద ప్రహార్ చేస్తున్నారు. అంటే దమనం అని చెప్పుకుందామో, లేక ఘర్షణ అనుకుంటే సరిపోతుందో తెలియదు. 

సామాన్యులకు, సాయుధ దళాలకు మ ధ్య నిజాలపైన అబద్ధ్దాలపైన పోరాటం జ రుగుతున్నది. అంటే నిజంగా మావోయి స్టులో లేదా అబద్ధపు మానోయిస్టులనే వారో  తెలియదు. అది అసలైన యుద్ధం. చనిపోయేవారిని మావోయిస్టులు అంటా రు.  చంపిన వారిని కూడా మావోయిస్టు లు అని కూడా అంటారు. నిజం ఏమిటో, ఫేక్ ఎన్ కౌంటర్లో, నిజమైన మావోయిస్టు లో చెప్పడం ఏ విధంగా సాధ్యం? ఈ లో గా చనిపోతున్నారు. కంకర్ అనే ప్రాం తంలో ఎన్నికల సభలో2022 ఏప్రిల్‌లో కేంద్ర హోం మంత్రి రాబోయే రెండే ళ్ల కా లంలో  మొత్తం నక్సలైట్లను తుదముట్టించాలని కంకణం కట్టుకున్నట్టు చెప్పారు. 

ఒక ద్రోణ్‌ల ద్వారా బాంబులు వేయ డం జరిగితే అది ఎన్ కౌంటర్ అనాల్సిన అవసరమేలేదు. ఇక సామాన్యుడా లేక, మావోయిస్టులా అదేమిటో కూడా తెలియని వాడో అమాయకుడో అనే అవకా శం కూడా లేదు. ఎందుకంటే డ్రోణ్ బాం బు ప్రహార్ జరుగుతూ ఉంటే, బాంబులు వేసేవాడు విడిగా ఎవడూ ఉండడు కనుక గుడ్డిగా ఎంచుకున్న ప్రాంతంలో జనులను ఉమ్మడిగా చంపుతూ ఉంటే దాన్ని ఏమనాలి. రాజ్యాంగమా, మరొకటా అని తెలి యనిదేమీ లేదు. అవి జనాన్ని తుది ము ట్టించడమే అని ముమ్మాటికి స్పష్టం అవుతుంది కదా. 

ఆరు నెలల్లో 130 మంది హతం

అనేక సార్లు మనం వింటున్న వార్తలప్రకారం ‘ఎన్ కౌంటర్ల’ కింద గత ఆరు నెలలనుంచి 130మంది నక్సలైట్లు అనుకునే సజీవ మానవులు చనిపోతున్నారని చెప్పారు. అందులో కనీసం 390మంది నక్సలైట్లను అరెస్టు చేసారు. మే 11 నుంచి జులై 18 వరకు 40మందిని నక్సలైట్లనే చెప్పుకుంటున్న వారిని చంపేసినట్టు ప్రకటించారు. వీటిని ఆపరేషన్లు అనాలా, ఆపరేషన్ ప్రహార్ అనాలా, లేక కేంద్ర రాష్ట్రాల, లేదా కో ఆపరేషన్ ఫెడరల్ దేశ సమాజమా అని ఎవరూ ఆలోచించడం లేదు. మన పత్రికలు మాత్రం ఆ పార్టీవా డు ఇంకో పార్టీకి ఫిరాయించారనో, లేక మరో మహానుభావుడు బీ ఆర్ ఎస్ నుం చి కాంగ్రెస్‌కు ఫిరాయింపు చేస్తున్నారనే విషయాలను మాత్రమే చర్చిస్తున్నాయి. చనిపోతున్న జనాల గతి ఏమిటి? 

మధ్యలో దేవుళ్లు కూడా వస్తుంటారు. నిజాలు ఉంటాయి. అంతకు ముందు ఖనిజాలు ఉంటాయి. వాటిని కాజేసుకునే బ డాబడా సంపన్నులు, వారికి కోట్లాది కోట్ల రూపాయలు విరాళాలు ఇవ్వగలిగిన పార్టీ లు, ఎన్నికల బాండ్లు దేశాన్ని నడుపుతుంటాయి.  మధ్యమధ్య సుప్రీంకోర్టు ఈ బాం డ్ల్లు రాజ్యాంగ వ్యతిరేకం అని స్పష్టంగా ఖండించిందనే విషయం తెలుసా?

-- వ్యాసకర ్త సమాచార శాఖ 

మాజీ కమిషనర్