calender_icon.png 21 April, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓడేడు మానేరులో ఉనుక లారీ బోల్తా

20-04-2025 10:21:53 PM

ముత్తారం (విజయక్రాంతి): భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లా సరిహద్దులోని ముత్తారం మండలంలోని ఓడేడు-గరిమెళ్ళపళ్లి మానేరు వాగులో ప్రమాదవశత్తు ఆదివారం ఉదయం ఉనుక లారీ బొల్తపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు క్లీనర్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద పెనుప్రమాదం తప్పింది. గత మూడు నెలల క్రితం మానేరు వాగులో ప్రయాణికుల సౌకర్యార్థం మట్టి రోడ్డు ఏర్పాటు చేయగా, ఆ మట్టి రోడ్డుపై కేవలం ద్విచక్ర వాహనాలు కార్లు ప్రయాణించాల్సి ఉండగా పెద్ద వాహనాలు లారీలు ఇసుకతో కంకరతో, ఇటుక లోడుతో లారీలు, ట్రాక్టర్లు ప్రయాణిస్తుండడంతో ఈ  ప్రమాదాలు జరుగుతున్నాయని రెండు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాస్తూ లారీ బోల్తా పడినప్పుడు ఎవరైనా ప్రయాణికులు ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మానేరు మట్టి రోడ్డుపై పెద్ద వాహనాలను ప్రయాణించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రెండు గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.