ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
ఆదిలాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుతం ప్రతి ష్టాత్మకంగా నిరహిస్తున్న సమగ్ర కుటుంబ సరేను ఆదిలాబాద్ జిల్లా లో ప్రజలు అడ్డుకున్నారు. సరేలో భాగంగా సిబ్బంది ఈనెల 6వ తేదీ నుంచి ఇంటింటికి స్టిక్కర్లను అతికిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్ర వారం.. ఇంద్రవెళ్లి, సిరికొండ మండలానికి చెందిన ప్రభుత ఉద్యోగులు మండలంలోని బోరోజూడ, మల్లాపూర్, ధర్మసాగర్ గ్రామాల్లో ఇళ్లకు స్టిక్కర్లు అతికిస్తుండగా.. 2016లో రెవెన్యూ పరంగా తమ గ్రామాలను సిరికొండ మండలం నుంచి ఇంద్రవెల్లిలో కలుపుతూ ప్రభుతం జీవో జారీచేసినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని గ్రామస్తులు సరే సిబ్బందితో పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ శాఖలో ఈ మూడు గ్రామా లు కలుపుతూ ప్రభుతం జీవో విడుదల చేయలేదన్నారు. తమ గ్రామాలను ఇంద్రవెల్లి మండలంలో కలిపే వరకు కుటుంబ సరే చేయనివమని వారు సరే అధికారులను అడ్డుకున్నారు. తమ సమస్య పరిష్కరించే వరకు అధికారులను, సిబ్బందిని గ్రామాలకు రానివమని గిరిజనులు స్పష్టం చేశారు. దీంతో గ్రామాల్లో చేపట్టే సరేపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తి నెలకొంది.