calender_icon.png 30 April, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసి రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

30-04-2025 12:00:00 AM

వెంకటాపురం (వాజేడు) ఏప్రిల్ 29: ఆదివాసీల రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షుడు తుర్స కృష్ణ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఏజెన్సీలో గిరిజనేతర్లకు అన్ని విధాలుగా హక్కులు కల్పిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఐదవ షెడ్యూల్ భూభాగంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు కూడా గిరిజనేతరులకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు తమ హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీల హక్కుల రక్షణ కోసం జీవో నంబర్ 3 ట్రైబల్ అడ్వైజరీ కమిటీ, అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టంగా మార్చాలని డిమాండ్ చేశారు.

5వ షెడ్యూల్ ప్రాంతాల చట్టాలను పరిరక్షించుకోవడానికి మే 5న ములుగు జిల్లా కలెక్టరేట్ ముత్తడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు తాటి నాగరాజు, బొగ్గుల రాజకుమార్, ప్రశాంత్, గట్టుపల్లి సంజీవ్, పూణెం అర్జున్, తాటి నిఖిల్ పాల్గొన్నారు.