calender_icon.png 28 December, 2024 | 4:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ స్కూళ్ల పోకడ అన్యాయం

25-06-2024 12:05:00 AM

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో పెట్టాలి. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ విద్యా హక్కు చట్టాన్ని అమలు పరచడంలో విద్యాశాఖాధికారులందరూ వైఫల్యం చెందారు. ఫీజులను అధికంగా వసూలు చేస్తున్నా, పాఠ్య పుస్తకాలను విచ్చలవిడిగా అమ్ముతున్నా, నచ్చిన పేర్లను బోర్డులపై ప్రచారం చేస్తున్నా, ఇవన్నీ విద్యాశాఖ అధికారులకు కనపడినా చూసీ చూడనట్టు వ్యవహరించడం అన్యాయం. విద్యాహక్కు చట్టం ప్రకారం వాటిలోని ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో బహిరంగంగా ప్రకటించాల్సి ఉంది. 

 వి.రాజశేఖర్ శర్మ, నాగర్ కర్నూల్ జిల్లా