దుస్తులూ, యాక్సెసరీల్లోనే కాదు.. బంగారు నగల్లోనూ వైవిధ్యమైన ఫ్యాషన్‌ను కోరుకుంటోంది ఈ తరం. అందుకే ఇప్పుడు ఆభరణాలన్నీ ఆధునిక సొబగులద్దుకొని మరీ వారిని ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటిల్లో ఎసెమిట్రికల్ స్టుల్ ఒకటి. నిన్నమొన్నటి వరకూ సాధారణంగా డ్రెస్‌ల్లో కనిపించిన ఈ డిజైన్ ఇప్పుడు జ్యూయెలరీకి నిండుదనం తెస్తోంది. ఈ తరహా నగలు.. ధరించినవారికి కొత్తదనాన్ని తెచ్చిపెట్టడమే కాదు చూసేవాళ్లందరినీ అయస్కాంతంలా ఆకట్టుకుంటున్నాయి. వాటిని మీరూ ఓ సారి ట్రై చేసేయండి!