సీసీఐ అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే
మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపన
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు (విజయక్రాంతి): వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో ట్రాక్టర్లు వచ్చిన వెంటనే తేమ శాతాన్ని చూసి ట్రాక్టర్లను వెంటనే దిగుమతులు చేసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీసీఐ అధికారులకు సూచించారు. మండలంలోని కొంపెల్లి గ్రామంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఉమ్మడి నల్గొండ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి తనిఖీ చేసి మాట్లాడారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన పత్తిని నాలుగైదు రోజులు దిగుమతి చేసుకోకుండా తేమశాతం విషయంలో అధికారులు ఉపయోగించే మిషన్లపై అనుమానాలు రైతులు వ్యక్తం చేయగా కొనుగోలు విషయంలో జాప్యం జరగకుండా రైతులని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని రైతులు మద్దతు ధర పొందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
అనంతరం మండలంలోని పులిపల్పుల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో తన సొంత ఖర్చులతో విద్యార్థులకు డిజిటల్ క్లాస్ ల కోసం మెటీరియల్ అందజేసి డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించారు. అదే గ్రామంలో 20 లక్షల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, బీరెల్లి గూడెం గ్రామంలో 20 లక్షల వ్యయంతో గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, కొరటికల్ గ్రామంలో 2 కోట్ల 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించే 33/11 కె వి విద్యుత్ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ, విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు, సిసిఐ అధికారి నిమ్ జే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, వెదిరే విజయేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జాల వెంకటేశ్వర్లు, ఒట్టికోటి శేఖర్, తాటికొండ సైదులు,జాల నాగరాజు, మక్కెన అప్పారావు,జితేందర్ రెడ్డి, ప్రమోద్, పందుల భాస్కర్ ఉన్నారు.