calender_icon.png 5 February, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా

04-02-2025 11:43:33 PM

ఏడుగురికి గాయాలు...

కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డిలో ఘటన..

కామారెడ్డి (విజయక్రాంతి): దహన సంస్కారాల కోసం కట్టెలను తీసుక వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు గాయాల పాలైన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డిలో  మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో ఒకరు మృతిచెందగా దహన సంస్కారాల కోసం కట్టెలను తీసుకువెళ్లే క్రమంలో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న కాచాపూర్‌కు చెందిన ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో పెద్ద మల్లారెడ్డి గ్రామస్తులు కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.