calender_icon.png 2 February, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా.. యజమాని మృతి

01-02-2025 10:25:40 PM

ధర్పల్లి (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన బొల్లారం సాయిలు (52) అనే వ్యక్తి వ్యవసాయ పనుల నిమిత్తం యూరియా సంచులను ధర్పల్లి నుండి తీసుకురావడానికి వెళ్ళినాడు. మార్గమధ్యమంలో ధర్పల్లి గ్రామ శివారులో గల వ్యవసాయ భూమి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పడంతో ట్రాక్టర్ బోల్తా పడి బొల్లారం సాయిలు అక్కడికక్కడే మృతి చెందినట్లు బొల్లారం సాయిలు కొడుకు సుధీర్ (22) పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ధర్పల్లి ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం మృతుడి శవాన్ని పంచనామ కొరకు గవర్నమెంట్ హాస్పిటల్ కు పంపడమైనదని తెలిపారు.