డ్రైవర్ మృతి
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): అతివేగంతో వెళ్తున్న కారు టైరు పేలి పల్టీలు కొట్టడంతో డ్రైవర్ అక్కడిక్కడే మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రా మ శివారులో శనివారం చోటుచేసుకుంది. కొల్లాపూర్ తహసీల్దార్ కా ర్యాలయంలోని ఓ ఉద్యోగి తన సొంత కారును అద్దె పద్ధతిన రెవె న్యూ పనులకు వాడుతున్నాడు.
కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన బిజ్జా దశరథం(50) కారు డ్రైవరుగా, చుక్కాయిపల్లి గ్రామానికి చెందిన మహేష్(30) తహసీల్దార్ కార్యాలయంలో అటెండరుగా పనిచేస్తు న్నారు. శనివారం ఇద్దరూ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫైల్స్ తీసుకుని సంతకాల కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తిగిరి వస్తున్నారు.
ఈ అతివేగంతో ఉన్న కారు టైరుపేలి ఫల్టీలు కొట్టడంతో దశరథం అక్కడికక్కడే మృతి చెందగా మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.