calender_icon.png 23 December, 2024 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైర్ పేలి కారు బోల్తా

07-10-2024 12:00:00 AM

ఒకరి మృతి 

అలంపూర్, అక్టోబర్ 6: కారు టైరు పేలడంతో అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ దుర్ఘటన అలంపూర్ పరిధిలోని ఎర్రవల్లి మండలం బీచుపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని కర్నూల్ వైపు వెళ్తున్న కారు టైరు బీచుపల్లి సమీపంలోని విజయవర్థని ఆయిల్ మిల్లు వద్ద జాతీయ రహదారిపై పగిలింది. దీంతో అదుపు తప్పి బోల్తా పడటంతో కర్నూల్ పట్టణం శ్రీనివాస్‌నగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందాడు.